తెలంగాణ బీజేపీ నేతలు కొద్ది రోజులుగా… విద్యుత్ స్కాం గురించి పదే పదే మాట్లాడుతున్నారు. తక్కువ ధరలకు అందుబాటులో విద్యుత్ ఉన్నప్పటికీ.. బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరకు కొనుగోలు చేశారనేది ఆ ఆరోపణ. చాలా కాలంగా ఈ ఇష్యూని బీజేపీ పట్టించుకోలేదు. కానీ ఒక్క సారిగా తెరపైకి వచ్చింది. అదే రోజువారీ విమర్శలకు కారణం అవుతోంది. రోజువారీ విద్యుత్ లోటు భర్తీ కోసం… యూనిట్‌కు రూ. నాలుగున్నరకు.. ప్రభుత్వ సంస్థలు విద్యుత్ అమ్మడానికి రెడీగా ఉన్న సమయంలో.. తెలంగాణ సర్కార్ యూనిట్ రూ. ఐదున్నర పెట్టి కొనుగోలు చేసి.. వందల కోట్లు గోల్ మాల్ చేసిందనేది.. బీజేపీ ఆరోపణ. దీనిపై… టీఆర్ఎస్ నేతలు.. ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. సీబీఐ విచారణ జరిపించుకోవాలని సవాల్ చేశారు.
ఈ విషయంలో.. రాజకీయంగా.. కౌంటర్ ఇవ్వడం కన్నా… బీజేపీకి.. మరో విధంగా.. ఆన్సర్ ఇవ్వాలనుకున్న ప్రభుత్వం.. విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావును రంగంలోకి దింపింది. సాధారణంగా రాజకీయ విమర్శలకు.. అధికారులు జవాబివ్వరు. కానీ ప్రభాకర్ రావు మాత్రం.. రంగంలోకి వచ్చి వివరణలు ఇవ్వడం ప్రారంభించారు. వివరణ మాత్రమే కాదు.. కావాలంటే సీబీఐ విచారణ చేయించుకోవచ్చంటూ.. సవాల్ కూడా చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. దీనిపైనా.. ప్రభాకర్ రావు స్పందించారు. దీంతో.. వివాదం ముదిరిపోతోంది.
అయితే.. బీజేపీ నేతల దూకుడు వెనుక.. వేరే కారణం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చే సూచనల ప్రకారమే.. తెలంగాణ నేతలు.. ఈ ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. ఈ వివాదాన్ని ఇంతకు ఇంత పెద్దది చేసి.. తర్వాత.. సీబీఐ విచారణ లాంటి.. వ్యవహారాలను తెరపైకి తెస్తారని అంటున్నారు. సహజంగా.. భారతీయ జనతా పార్టీ.. పొలిటికల్ గేమ్ ప్లాన్ అలాగే ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక నేతల్ని… దర్యాప్తు సంస్థల చట్రంలో ఇరుక్కునేలా చేస్తారు. బెంగాల్లో అదే జరుగుతోంది. తెలంగాణపై గురి పెట్టిన.. బీజేపీ అదే చేయబోతోందని… భావిస్తున్నారు.