ఖమ్మంలో నిన్న ” నాకేమైనా పర్వాలేదు.. 48వేల మంది ఆర్టీసీ కార్మికులు బాగుండాలంటూ..” ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్న ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి .. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 90 శాతం కాలిన గాయాలతో.. ఆయనను ఖమ్మం నుంచి హుటాహుటిన హైదరాబాద్లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
ఆర్టీసీ సమ్మె ప్రారంభమయిన తర్వాత పలువురు ఆర్టీసీ ఉద్యోగులు.. వారి కుటుంబసభ్యులు.. గుండెపోటుతో చనిపోయిన ఘటనలు జరిగాయి. ఆయితే.. ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం ఇదే. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగులంతా.. మాజీలైపోయారని.. వారికి ఈ నెల జీతాలు కూడా చెల్లించే ప్రశ్నే లేదని.. కేసీఆర్ అదే పనిగా చెబుతున్నారు. దీంతో.. కార్మికుల ఆందోలన మరింత ఉధృతమవుతోంది. ఈ నేపధ్యంలో చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు చేసుకుంటూండటంతో… ఆత్మబలిదానాల తెరపైకి వస్తున్నాయి. ఇది పరిస్థితిని ఆందోళనకరంగా మారుస్తోంది.
ఆత్మహత్యలు వద్దని.. పోరాడి ప్రభుత్వం మెడలు వంచుదామని… విపక్ష పార్టీల నేతలు.. కార్మిక సంఘా నేతలు కార్మికులకు పిలుపునిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు… ప్రభుత్వానిదే బాధ్యత అని.. కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని.. వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. పోలీసులు మాత్రం… కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. మరో వైపు.. తెలంగాణ ఉద్యమంలో.. పాలు పంచుకోని… మంత్రులతో ప్రకటనలు చేయిస్తూ.. ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల్ని మరింత రెచ్చగొడుతోందనే అభిప్రాయం కార్మికుల్లో ఏర్పడింది.