తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కొన్ని సినిమా పాటల డ్యాన్స్ మూమెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను తక్కువ చేసి చూపించే డ్యాన్స్ స్టెప్పులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల సినిమా పాటల్లో డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా ఉండటంతో పాటు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్కు పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.
ప్రత్యేకంగా సినిమా పేరు ప్రస్థావించలేదు కానీ ఇటివలే కొన్ని సినిమాల్లో పాటల వాటి స్టెప్స్ పై షోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పుష్ప లో పీలింగ్స్, మిస్టర్ బచ్చన్ లో బ్యాక్ పాకెట్ స్టెప్పు, డాకు మహారాజ్ లో డబిడి దిబిడి, ఇటివలే రీలీజైన రాబిన్ హుడ్ లో అదిదా సర్ప్రైజ్ పాటలో అయితే మూమెంట్స్ మరీ వికారంగా తయారైయ్యాయి. అయితే ఈ పాటలకి శేఖర్ మాస్టరే కొరియోగ్రాఫర్ కావడం గమనించాల్సిన విషయం. ఈ పాటల్లో మహిళాని చిత్రీకరిస్తున్న విధానంపై చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలోనే మహిళా కమీషన్ కూడా స్పందించింది. మరి కమీషన్ ఆదేశాలని ఫిల్మ్ మేకర్స్ ఏ మేరకు పట్టించుకుంటారో చూడాలి.