భీమ్లా నాయక్ నిర్మాతల్ని, బయ్యర్లను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ఏపీ ప్రభుత్వం చేయాలనుకున్నదంతా చేస్తోంది. టిక్కెట్ రేట్ల జీవో.. ఐదు షోలు వేసుకునే అవకాశాన్ని ఇస్తామని స్వయంగా సీఎం చెప్పినా ఇంత వరకూ విడుదల కాలేదు. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కంటే ముందు జీవోరాదని చాలా మంది అంచనా వేస్తున్నట్లుగానే పరిస్థితులు ఉన్నాయి. జీవో వస్తుందని .. పెరిగిన టిక్కెట్ రేట్లకు అమ్ముకోవచ్చని ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్‌కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది.
భీమ్లా సినిమా మెజార్టీ ధియేటర్లలో విడుదలవుతూండటంతో ఎవరైనా టిక్కెట్ రేట్లకు ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఏపీలో కలెక్షన్లను వీలైనంతగాపరిమితం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చేయాలో అన్నీ చేస్తుందని తేలిపోయింది. అయితే అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం భీమ్లా విషయంలో ఎంతో పాజిటివ్ గా ఉంది. గతంలోనే టిక్కెట్ రేట్ల పెంపునకు ఆమోదం ఇచ్చింది. ఇప్పుడు రెండు వారాల పాటుఐదు షోలు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది.
రెండు ప్రభుత్వాల మధ్య వ్యవహారంలో ఇదే స్పష్టమైన తేడా. పరిపాలనను రాజకీయ అంశాల్లో లెక్కలు సరి చేసేందుకు ఉపయోగించుకోవడం తారస్థాయికి చేరిందని ఇది మంచి పరిణామం కాదన్న అభిప్రాయం ఏపీలో వినిపిస్తోంది. అయినా ఏపీ ప్రభుత్వం వినిపించుకునే పరిస్థితిలో లేదు. తమరాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కల్యాణ్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి ఎలాంటి అవకాశాన్నీ వదులుకునేది లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.