ఆంధ్రప్రదేశ్‌లో.. ఇంగ్లిష్‌ను.. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ.. తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. అదే సమయంలో.. తెలంగాణ సర్కార్.. ఐదో తరగతి వరకూ.. తెలుగులోనే బోదించాలని.. స్పష్టం చేసింది. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే జరగాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సర్కారీ బడుల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతోంది. ప్రైవేటు స్కూళ్లలోనూ.. అమలు చేయాలని.. కేంద్ర ప్రభుత్వానికి సూచనలు పంపించింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో నాలుగేళ్ల క్రితమే ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారు. కానీ బలవంతం కాదు. తెలుగు మీడియం కూడా ఉంది. విద్యార్థులకు ఏది ఇష్టమైతే అందులో చేరుతున్నారు.
అన్ని పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ జారీ చేసింది. తెలంగాణలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా … 4,800 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉంది. విద్యా కమిటీల అంగీకారం ఉన్నచోట మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పటికీ స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు, గ్రామస్థులు ముందుకొస్తే అనుమతిస్తున్నారు తప్ప బలవంతంగా మాత్రం రుద్దడం లేదు. ప్రాథమిక విద్యను మాతృభాషలో చదివితేనే విద్యార్థులకు పాఠ్యాంశాలు బాగా అర్థమవుతాయనే భావనతో ప్రభుత్వం ఉంది. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని జాతీయ నూతన విద్యావిధానం ముసాయిదాలో కమిటీ సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం సమర్థిస్తోంది.
తెలుగు మీడియం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనేది.. ఏపీ సర్కార్ అభిప్రాయం . వారు ఎదగలేకపోతున్నారని అనుకుంటోంది. అందుకే.. తెలుగు ను నులిమేసి.. ఇంగ్లిష్‌కు ప్రాణం పోస్తోంది. అయితే.. దీనికి భిన్నంగా తెలంగామ సర్కార్ అడుగులు వేయడం.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి..మాతృభాషలోనే ప్రాధమికంగా విద్యాబోధన జరిగితే.. మెదడు వికసిస్తుందని నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. ఓ వైపు.. ఆర్టీసీ విలీనం విషయంలో.. కేసీఆర్ .. జగన్ వైఖరికి భిన్నమైన వ్యూహం అవలంభించంగా.. ఇప్పుడు.. రివర్స్‌లో.. తెలుగు విషయంలో జగన్ నిర్ణయంపై.. అలాంటి వ్యతిరేక వైఖరినే గట్టిగా అవలంభిస్తున్నారు కేసీఆర్.