తెలంగాణలను కోటి ఎకరాల మాగాణం చేయాలనే లక్ష్యాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సాధించారు. ఈ ఏడాది… కోటికి ఎకరాల్లో…మాగాణి పంటలను రైతులు పండిస్తున్నారు. వానా కాలం సీజన్లో.. కోటి ఇరవై లక్షల ఎకరాల్లో పంటల సాగును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికి.. కోటి పదమూడు లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. మిగతా లక్ష్యాన్ని కూడా.. సాధించే అవకాశం ఉంది. గత ఏడాది ఇది 76 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ ఏడాది ప్రధానమైన పత్తి, వరి, కంది తదితర పంటలు కోటి .. నాలుగు లక్షల ఎకరాల్లో వేశారు.
వివిధ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఇటీవలి కాలంలో పెరిగింది. అదే సమయంలో వర్షాలు కూడా సహకరిస్తున్నాయి. భూగర్భ జల నీటి మట్టాలు కూడా పెరిగాయి. దీంతో రైతులు పంటలు పండించడానికి ఇబ్బంది లేకుండా పోయింది. రైతు బంధు.. ఇతర పథకాలతో… వారికి పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో సాగు క్రమంగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని సాగు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేంద్రం.. సమీకరిస్తున్న బియ్యంలో సగానికిపైగా తెలంగాణ నుంచే వస్తోంది. పంటల సాగు పెరగడం.. అందరూ ఒకే రకమైన పంటలు వేస్తూండటంతో… మద్దతు ధర సమస్యలు వస్తూండటంతో.. ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ విధానాన్ని తెచ్చింది.
ప్రస్తుతం.. రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలే వేశారు. దీంతో… మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా పంటలు అందుబాటులోకి రానున్నాయి. అందువల్ల… మద్దతు ధర అనే సమస్యే రాదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగు విస్తీర్ణం ముందు ముందు మరింత పెరుగుతుందని.. సాగునీటి సామర్థ్యం అంతకంతకూ పెంచుతున్నందున రానున్న రోజుల్లో.. తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారుతుందని… టీఆర్ఎస్ నేతలు .. అంచనా వేస్తున్నారు.