ఒకప్పుడు హైదరాబాద్ శివారు తెల్లాపూర్ అంటే.. అబ్బో చాలా దూరమే అనుకునేవారు. కానీ ఇప్పుడు తెల్లాపూర్‌లో ఇల్లు లేదా ఫ్లాట్ ఉందంటే అదృష్టవంతుడే అనుకుంటున్నారు. అంతగా అభివృద్ది చెందింది మరి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అనుకుని ఉన్న తెల్లాపూర్ ఇప్పుడు హై రైజ్ అపార్టుమెంట్లు, లగ్జరీ విల్లాలకు వేదికగా మారింది. ప్రతి నెలా ఒక బడా కంపెనీ హైరైజ్ అపార్టుమెంట్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తోంది. వాటికి బుకింగ్‌లు కూడా ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి.
బీహెచ్ఈఎల్కు ఓ వైపు ఉండే తెల్లపూర్ … మొదటి నుంచి హాట్ ఫేవరేట్ గానే ఉంది. కానీ మధ్యలో ఒడిదుడుకు ఎదుర్కొంది. నల్లగండ్ల వరకూ భారీ ప్రాజెక్టులు వస్తున్నా అవి తెల్లాపూర్ వరకూ రావడానికి టైం పట్టింది. ఇప్పుడు మాత్రం … నల్లగండ్ల నిండిపోవడంతో.. తెల్లాపూర్ డెస్టినీగా మారింది. హైదరాబాద్‌లోని టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ఏరియాలో ప్రాజెక్టులు చేపట్టాయి. మైహోం ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతోంది. ఇక రాజపుష్ప కేంద్రం అక్కడే.
అభివృద్ధికి తగ్గట్లుగానే రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. రెడీగా ఉన్న అపార్టుమెంట్లు కనీసం రూ. కోటి పలుకుతోంది. ఇక నాలుగేళ్ల తర్వాత డెలివరీ ఇచ్చే లా భూమి పూజ చేసుకుంటున్న కొత్త ప్రాజెక్టుల్లో ఫ్లాట్ కోటిన్నరకుపైగానే ఉంటోంది. ఇక్కడ ప్రశాంతమైన గాలి, వాతావరణం ఉండటం అందర్నీ ఆకర్షిస్తోంది. ఐటీ కారిడార్‌లో భాగం కావడం కూడా.. తెల్లాపూర్ అభివృద్ధికి మరో కారణం అనుకోవచ్చు. సాంకేతికంగా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోకి వస్తున్నా… ఇక్కడ మౌలిక సదుపాయాలకు మాత్రం లోటు ఉండదు.
కాస్త ధర ఎక్కువైనా ప్రశాంతంగా జీవించాలనుకునేవారికి .. తెల్లపూర్ ఏరియా మంచి డెస్టినేషన్ అవుతుందంటే అతిశయోక్తి కాదు.