హైదరాబాద్‌లో ఐటీ కారిడార్ కు పదికిలోమీటర్లు అటూ ఇటూ ఓ పెద్ద మహానగరం ఏర్పడుతోంది. అది విదేశీ నగరాలతో పోటీ పడేలా ఉంటుంది. రాత్రి పూట ఒక్క సారి ఓఆర్ఆర్ మీదుగా నానక్ రాం గూడ , గచ్చిబౌలి వైపు వెళ్తే .. విదేశీ నగరంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అందుకే అటు వైపు మహానగరం విస్తరిస్తోంది. అయితే దానికి తగ్గట్లుగా అది సామాన్యులకు.. మధ్యతరగతి వారికి కాదన్న భావన కూడా ఏర్పడుతోంది. దానికి పెరుగుతున్న ధరలేక కారణం.
ఐటీ కారిడార్‌కు తెల్లాపూర్ ఏరియా చాలా సమీపంలో ఉంటుంది. అయినా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. చిన్ని బిల్డర్లు, అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్ హౌసులు నిర్మించేవారు. యాభై లక్షలకు కూడా లభించేవి. నాలుగైదేళ్ల కిందట కూడా అందుబాటు ధరల్లో ఎంతో మంది మధ్యతరగతి ప్రజలు ఇళ్ల యజమానులయ్యారు. అయితే గత రెండు, మూడేళ్ల నుంచి పరిస్థితి మారిపోయింది. బడా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు చేపట్టే ప్రాజెక్టుల్లో ఎంత ధర ఉంటుందో … చిన్న బిల్డర్లు కూడా అంతే రేటు చెప్పడం ప్రారంభించారు. కాస్త తగ్గించినా .. సౌకర్యాలు మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు.
ఇప్పుడు తెల్లాపూర్ లో అయినా అపార్టుమెంట్ రూ. కోటికి తగ్గడం లేదు. సమీపంలో ఉన్న నల్లగండ్ల ఎప్పుడో మధ్యతరగతికి దూరం అయింది. ఆ తర్వాత తెల్లాపూర్ కూడా అందుబాటులో లేకుండా పోవడం మధ్యతరగతికి ఇబ్బందికరమే. డిమాండ్ ను బట్టి ఇలా చెబుతున్నారని మార్కెట్ కరెక్షన్ నడుస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చిన్న స్థాయి రియల్టర్లు ఇప్పటికే రియలైజ్ అవుతున్నారని.. ధరలు తగ్గించి అమ్ముతున్నారని చెబుతున్నారు. తెల్లాపూర్ ఖచ్చితంగా హాట్ ప్రాపర్టీనే కాదు.. అది మధ్యతరగతికి అందుబాటులో ఉంటేనే అని రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా గుర్తిస్తున్నాయి.