సినిమా సమీక్షలకు సంబంధించి టీవీ9 చేసిన చర్చలో తెలుగు360 అభిప్రాయం తీసుకోవడం అందరినీ ఆకర్షించింది. దీనిగురించి అమెరికా నుంచి 360 తరపున కృష్ణ మాట్లాడ్డం చాలా మంది గమనించారు. విన్నారు కూడా. సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరుగుతుందనే భావన వున్నా ఇంత ప్రముఖంగా మాట్లాడించడం, అభిప్రాయం తీసుకోవడం కొత్త పరిణామం. అంతేగాక ఈ చర్చకు సంబంధించిన టీవీ9 క్లిప్పింగును యూట్యూబ్లో లక్షల మంది చూస్తున్నారు. ఇటు సినిమా అటు మీడియా వర్గాలనే గాక యువ ప్రేక్షకులనూ ఈ చర్చ ఆకట్టుకుంది. విదేశాల్లోని భారతీయ కుటుంబాలు 200 డాలర్లు ఖర్చు పెట్టి సినిమా చూస్తారు గనక వారికి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత వుందని కృష్ణ స్పష్టం చేయడం కూడా నచ్చింది. చిత్రాలు విఫలమయితే మా సమీక్షలను తిడుతున్నారు గాని భారీ హిట్ అయితే అప్పుడు మాత్రం హీరో గొప్పతనమంటే ఎలా అని మంచి ప్రశ్న వేశారు. చిత్రం విడుదలయినాక ఎవరయినా ఏదయినా రాయొచ్చని సమీక్షను వాయిదా వేయడానికి లేదా వారం పది రోజులు అని గడువు పెట్టడానికి ఎవరికీ అధికారం వుండబోద ని చర్చలో పాల్గొన్న సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ కూడా వ్యాఖ్యానించారు. బహుశా ఇకమీదట ఇలాటి అప్రస్తుత విమర్శలు తగ్గొచ్చు.
https://www.youtube.com/watch?v=BOPOHKf7AF8