గ్లోబల్ బిజినెస్ సమ్మిట్- 2020 కు సర్వం సిద్ధమైయింది. కరోనా నేపధ్యంలో వర్చువల్ గా జరగనున్న ఈ సమావేశంలో ప్రపంచ ప్రఖ్యాత బిల్ గేట్స్ తో కలిసి ప్రపంచ వ్యాపార వేదిక పై తమ ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, అవకాశాల పై పలువురు ప్రముఖులు చర్చించనున్నారు. ఈ రోజు జరిగిగే ఈ సమ్మిట్ లో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరవుతున్నారు.
ఇక్కడ ఇంకో విశేషం కూడా వుంది. ఈ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం ఓ తెలుగు న్యూస్ ఛానల్ సీఈవోకి దక్కింది. AP24*7 ఛానల్ CEO సుధాకర్ అడపా కూడా ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. సుధాకర్ ది బిజినెస్ నేపధ్యం, ఐఐఎం గ్రాడ్యుయేట్, పలు కంపెనీలకు సీఈవోగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయనకి ఈ సమ్మిట్ లో పాల్గొనే అవాకాశం దక్కింది. ఏదేమైనా బిల్ గేట్స్ లాంటి దిగ్గజాలు పాల్గొనే ఇలాంటి సమిట్ లో ఓ తెలుగు ఛానల్ సిఈవో పాల్గొనడం బహుసా ఇదే ప్రధమం కావచ్చు. అలాగే ఈ సమ్మిట్ లో భారత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నెట్ ఫ్లిక్స్ కో సీఈఓ టెడ్ సారండోస్.. కూడా పాల్గొంటారు. కరోనా నేపధ్యంలో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచం ఎలాంటి సవాళ్ళు ఎదురుకొని మళ్ళీ ఆర్ధికంగా పుంజుకోవాలనే అంశాలు ఈ సమిట్ లో చర్చకు రానున్నాయి.