సినిమా ట్రెండ్ మొత్తంగా మార్చేసింది టాలీవుడ్. ఇక్కడ ఓ సినిమా క్లాప్ కొట్టుకొందంటే అది నూటికి 90 శాతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయి తీరుతోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్… వీళ్లంతా పాన్ ఇండియా కథలతో బరిలోకి దిగుతున్నారు. యువ హీరోలు సైతం కథ డిమాండ్ చేసిందని పాన్ ఇండియా పాట పాడుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితం అయిన మన హీరోలు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతున్నారు, మార్కెట్ కూడా పెంచుకున్నారు. ఈ క్రమంలోనే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా ప్రయోగాలు చేయటానికి, విభిన్న కథలు చేయటానికి మొగ్గుచూపుతున్నారు. తెలుగు సినిమా మార్కెట్ స్టాయి ఏంటో ఈ మధ్య వచ్చిన కల్కి నిరూపించింది. రూ. 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించి, ఓవర్సీస్ లో కూడా టాప్ లో నిలిచింది. ఈ కారణంగా తెలుగు సినిమా మార్కెట్ ఇంకొంచెం పెరిగింది. బాలీవుడ్ లో కూడా తెలుగు సినిమాలకి మార్కెట్ పెరిగింది.
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తమిళంలో మంచి మార్కెట్ ఉండేది. కర్ణాటకలో ఉన్నా – మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అంత పెద్ద స్థాయిలో మార్కెట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఓవర్సీస్ తో పోటీ పడుతూ తెలుగు సినిమా అక్కడ అమ్ముడుపోతోంది. రాబోయే స్టార్ హీరోల చిత్రాలకు కర్ణాటకలో మంచి డిమాండ్ ఏర్పడింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ కర్ణాటక రైట్స్ రూ.32 కోట్లకి, ఎన్టీఆర్ దేవర రూ. 25 కోట్లకి డీల్ ఫిక్స్ ఆయిందని టాక్.
కన్నడలో ఎన్టీఆర్ కి మంచి ఆదరణ ఉంది. కర్ణాటకలో ఎన్టీఆర్ దాదాపుగా లోకల్ హీరోగా చెలామణి అవుతున్నారు. అందుకే దేవర హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడి రూ.25 కోట్లకి దక్కించుకున్నారు. ఇdఇ ఐకాన్ స్టార్ కెరియర్ లోనే హైయెస్ట్ డీల్ అని తెలుస్తోంది. కర్ణాటకలో, ఆంధ్రా బోర్డర్ లో తెలుగువాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తారు. తమిళనాడు బోర్డర్ లో తమిళ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆ వెర్షన్ రిలీజ్ చేయనున్నారు. బెంగుళూరులో నార్త్ వారు ఎక్కువ మంది ఉంటడం వలన హిందీ వెర్షన్ కి ఆదరణ దక్కుతుంది. కేరళ బోర్డర్ లో మలయాళీ వెర్షన్స్, మిగిలిన స్టేట్ మొత్తం కన్నడ, రిలీజ్ అవుతాయి. యువ హీరోలు నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్ సినిమాలకూ బెంగళూరులో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కన్నడలో పెద్ద హీరో మార్కెట్ కు, క్రేజ్ కు తగ్గని విధంగా అక్కడ సినిమాలు ఆదరణకు నోచు కొంటున్నాయి. అందుకే కర్ణాటక రేట్లు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.