హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలుగుదేశం పార్టీ నాయకురాలు శోభారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కాలేయం పాడయిందని ప్రచారం ఉందని, ఇప్పుడు చీప్ లిక్కర్ తాగించి ప్రజల ఆరోగ్యాలుకూడా చెడగొడతారా అని శోభారాణి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలుకూడా కేసీఆర్‌లాగా తాగాల-ఊగాల అనే పద్ధతిని అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. మంచి మద్యాన్ని ప్రవేశపెట్టబోతున్నానని సీఎమ్ చెబుతున్నారని, మంచి మద్యాన్ని ఆయన తాగి చూశారా అని అడిగారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని లిక్కర్ మాఫియా చేతిలో పెట్టబోతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి త్వరలో ఆధారాలు బయటపెడతానని చెప్పారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం అభివృద్ధి అంతా తెలుగుదేశం హయాంలో జరిగిందేనని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు.