మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. చంద్రబాబు కూడా ప్రచారం చేయాల్సి ఉంది కానీ ఆయన సోదరుడు చనిపోవడంతో షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. మహారాష్ట్రలో మంచి ఫలితాలు రావడంతో పవన్ కల్యాణ్ ను ఢిల్లీలో కూడా ప్రచారానికి పిలుస్తారని ఆయన జాతీయ స్థాయి నేత అన్న ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారంపై విస్తృత ప్రచారం జరిగింది. అయితే ప్రచార గడువు దగ్గర పడుతున్నా తెలుగు నేతల్ని ఢిల్లీ నేతలు పట్టించుకోవడంలేదని లేదు.
ఢిల్లీలో ఉండే ప్రజలు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు. తెలుగువారు కూడా గణనీయ సంఖ్యలో ఉంటారు. వారిని ప్రభావితం చేసేందుకు తెలుగు వారిని కూడా పిలుస్తారని అనుకున్నారు. కానీ వారిని పిలిస్తే వారు చేసే ప్రచారం కన్నా వారు చేసుకునే ప్రచారం ఎక్కువగా ఉంటుందని .. అనవసరమైన రిస్క్ ఎందుకని సైలెంట్ గా ఉండిపోయారేమో కానీ ఎవరూ పిలవడం లేదు.
ఢిల్లీఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. కాంగ్రెస్ కొన్ని సీట్లు సాధించినా చాలని అనుకుంటోంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు…తమ స్థానిక బలంతోనే గట్టిగా ప్రయత్నం చేసుకుంటున్నాయి. ఢిల్లీ ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేతలు చెప్పే మాటల కన్నా.. తమ అవసరాలు.. మంచి చేసే రాజకీయ పార్టీలకు ఓట్లు వేయడంలో ఎక్కువ విజ్ఞత చూపిస్తారు. అందుకే పెద్దగా హడావుడి చేయడం లేదని అనుకోవచ్చంటున్నారు.