వైఎస్ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అసుల వైఎస్ ఫ్యామిలీ ఏమిటి.. తెలంగాణలో రాజకీయాలేంటి అనుకునే పరిస్థితి నుంచి వారు అక్కడ పోలీసులను నేరుగా కొట్టే వరకూ దూకుడు చూపించడం హాట్ టాపిక్ అవుతోంది. మానవ హక్కుల సంఘం ప్రచురించిన పుస్తకంలో అప్పుడెప్పుడో పులివెందులలో స్టేషన్ లోకి వెళ్లి మరీ జగన్ ఎస్ఐను కొట్టాడని చెప్పుకున్నారు. ఇప్పుడు షర్మిల అందరి ముందు ఎస్ఐను కారులోనుంచి లాగి మరీ కొట్టేశారు. ఆమె తీరు చూసి పోలీసులే బిత్తరపోయారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో కానీ.. అంత అలుసు మాత్రం వ్యవస్థల్ని కాపాడలేని రాజకీయ నేతలు.. పాలకుల వల్లే వచ్చింది. అటు ఏపీలో వివేకా హత్య కేసు డ్రామా, ఇటు తల్లీకూతుళ్ల కొట్టుడు కలిసి..రాజకీయాలు మొత్తం వైఎస్ ఫ్యామిలీ వల్లే నాశనమైపోయాయని తల పట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చింది.
వివేకా కేసులో ఒకరిపై ఒకరు నిందలు
వివేకా నందరెడ్డి హత్య కేసు అత్యంత దారుణం. ఆయనను చంపిందెవరో అందరికీ తెలుసు. పిట్ట కథలను చెప్పి.. సాక్షి పత్రికలో రాసినంత మాత్రాన తెలుసుకోలేనంత కళ్లు మూసుకుపోియన జనం లేరు. అయినప్పటికీ.. కుటుంబంలోనే ఒకరిపై ఒకరు నిందలేసుకోవడానికి.. చరిత్రనంతా బయట పెట్టుకుంటున్నారు. ఆ కుటుంబంపై ఇప్పటికే అనేక రకాల ప్రచారాలుఉన్నాయి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. రాజారెడ్డి తండ్రి దగ్గర నుంచి .. షర్మిల రెండో పెళ్లి వరకూమొత్తం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అయినా వారికేమీ పట్టింపు లేదు. ఎందుకంటే ఇలాంటి వాటిని అధిగమించి.. ఎలా తమ ఇమేజ్ ను మీడియా, సోషల్ మీడియా ద్వారా బిల్డ్ చేసుకోవాలో వాళ్లకు బాగా తెలుసు.
అధికారం కోసం దేనికైనా తెగించే రకం !
వైఎస్ ఫ్యామిలీలో పరిస్థితుల్ని చూస్తే అధికారం కోసం దేనికైనా తెగించేరకం అని సులువుగానే అర్థమైపోతుంది. వివేకా హత్య అనంతర జరిగిన పరిణామాలు.. తాము తప్పు చేసి.. అదే పనిగా పక్కన వాళ్ల మీద తోసేయడం.. ఎప్పుడూ ఎక్కడా జరగని అనుమానాస్పద మరణాలు ..అన్నీ ఆకుటుంబంలోనే చోటు చేసుకుంటూ ఉంటాయి. అధికారం కోసం చివరికి పొరుగురాష్ట్రం వెళ్లి పార్టీపెట్టుకుని అక్కడ వేసే డ్రామాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వారి వ్యవహారాలన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నా.. వారికున్న ధైర్యమేంటి అని ఆశ్చర్యపోతున్నారు.
రాజకీయ దోపిడీదాడులు – ప్రశ్నించకుండా దాడులు !
దేశంలో అత్యంత దారుణమైన రాజకీయ దోపిడికి పాల్పడింది వైఎస్ కుటుంబమే. దేశంలో చాలా రాజకీయ పార్టీలు అవినీతి చేస్తాయి కానీ.. మళ్లీ అవి రాజకీయంగానే ఖర్చు చేస్తాయి. వ్యక్తిగత ఆస్తులను పెంచుకోరు. కానీ జనాలను నిలువునా దోపిడీ చేసి వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటుంది వైఎస్ ఫ్యామిలీ. వనరులు మాత్రమే కాదు.. పేదల రక్తాన్ని.. మధ్యం ధరలతో ఎలా దోచుకుంటున్నారో.. ఆ లిక్కర్ బ్రాండ్లు ఎక్కడివో.. ఆ డబ్బులన్నీ ఎక్కడికిపోతాయో ఊహించడం పెద్ద కష్టం కాదు. ఏపీ సరిపోలేదని ఇప్పుడు తెలంగామ మీద కూడా పడ్డారు. ఎవరైనా విరి అవినీతిని ప్రశ్నిస్తే ఫ్యాక్షన్ దాడులే. ఆర్థికంగా దెబ్బకొడతారు. మానసికంగా హింసిస్తారు.ఎలా చేసినా చంపేదానో.. చచ్చేదాకనో వదిలి పెట్టరు. ఇంత క్రూరమైన ఫ్యామిలీ ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉంది.
ఏ పుణ్యమా అని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రజలు ఒక్క చాన్స్ ఇచ్చారో కానీ.. అప్పుడే ఉమ్మడి ఏపీకి మంచిరోజులు పోయాయి. ఆయన దోచుకున్న మోడల్ తో … తలా పావలా పంచి ఓటు బ్యాంకును కాపాడుకుని మిగతా మొత్తం దాచుకుంటున్నారు. ఇప్పుడుఆ ఫ్యామీలీ ఎక్కడ అధికారం దొరుకుతుందనుకుంటే అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. అందుకే ఈ అరాచకం అంతా.