టెస్లా ఇండియాలో ప్లాంట్ పెట్టాలని అనుకుంటోంది. ఇంకా ఎక్కడ పెట్టాలని డిసైడ్ చేయలేదు. ముందుగా కాస్త పన్నులు తగ్గించడంతో ఇంపోర్టెడ్ అమ్మబోతోంది. జర్మనీ ప్లాంట్ నుంచి ఇండియాకు తీసుకు వచ్చి అమ్ముతారు. అయితే వీలైనంత త్వరగా ప్లాంట్ పెట్టాలని ఎలాన్ మస్క్ నిర్ణయించారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్లాంట్ పెడితే చాలా ప్రయోజనాలు వస్తాయి. అందుకే మస్క్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లాంట్ తమ రాష్ట్రానికి రావాలంటే.. తమ రాష్ట్రానికే రావాలని ప్రయత్నించేవారున్నారు.
టెస్లా ప్రధానంగా పహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తోందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తిరస్కరించలేనంత ఆఫర్లు ఇచ్చి అయినా ప్లాంట్ ను తెప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణకు ప్రత్యేకంగా అడ్వాంటేజ్ ఉంది. పారిశ్రామికంగా అనుకూలంగా ఉండే ప్రాంతం అయితే పోర్టు లేకపోవడం మైనస్. ఏపీ పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. కియా లాంటి పరిశ్రమ ఉంది. అలాగే పోర్టులు అడ్వాంటేజ్. కావాల్సినంత భూమి తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించి అయినా టెస్లాను ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇందు కోసం సన్నాహాలు ప్రారంభించింది. అసలు ప్రయత్నించకుండా.. వచ్చే పరిశ్రమలను కూడా కమిషన్ల పేరుతో బెదరగొట్టి పంపేయడం కన్నా.. పారిశ్రామిక రాయితీలు ఇచ్చి.. ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా చేస్తే దీర్ఘకాలంలో ఏపీ ఆటోమోబైల్ హబ్ గా మారే అవకాశం ఉంది. టెస్లా గిగా ఫ్యాక్టరీ వస్తే.. ఇండియా అమ్మకాలే కాదు.. ఇతర దేశాలకూ ఎగుమతి చేయవచ్చు. అయితే టెస్లాను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు.
ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా.. ప్రయత్నించడమే గెలుపని కార్పొరేట్ వర్గాలు చెబుతాయి. ఈ ప్రకారం చంద్రబాబు, లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించాయని కోరుకుందాం. వచ్చినా రాకపోయినా ప్రయత్నమైతే చేయడం ప్రభుత్వం బాధ్యత.