Click here for : తెలుగు360 సర్వే : విజయనగరం జిల్లాలో నువ్వానేనా..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.. ఎప్పుడూ లేనంత ఉత్కంఠను కలిగిస్తున్నాయి. జనసేన ప్రభావం కారణంగా… ఎవరికి సానుకూల పరిస్థితులు ఉన్నాయో.. స్పష్టంగా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. జాతీయ సర్వేలన్నీ… జనసేనను లెక్కలోకి తీసుకోకుండా అంచనా వేస్తున్నారు. ఇక లోకల్‌గా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న సర్వేలన్నీ.. ఏ పార్టీ వారు .. ఆ పార్టీకి అనుకూలంగా.. ప్రచారం చేసుకుంటున్నారు. కానీ శాస్త్రీయంగా వేసిన అంచనాలు మాత్రం పెద్దగా లేవు. తెలుగు 360 ఈ విషయంలో స్పష్టమైన అంచనాలు వేసేందుకు ప్రయత్నించింది. మాకున్న నెట్వర్క్ సాయంతో… విభిన్న వర్గాల ప్రజలతో మాట్లాడి.. సర్వేను సిద్ధం చేయడం జరిగింది. దాని ప్రకారం.. రోజుకో జిల్లా విశ్లేషణను.. ఇక్కడ అందిస్తాం. మొదటి రోజు.. శ్రీకాకుళం జిల్లా సర్వే వివరాలు..!
గతంతో పోలిస్తే టీడీపీ పరిస్థితి క్లిష్టమే..!
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏడు, వైసీపీ మూడు స్థానాల్లో గెలిచింది. ఇందులో ఇద్దరు టీడీపీలో చేరిపోయారు. ఎన్నికల సమయానికి వైసీపీ.. ఒక్క స్థానానికే పరిమితం అయింది. అయితే.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి హోరాహోరీగా అన్నట్లుగా సాగుతోందని… తెలుగు 360 సర్వేలో వెల్లడయింది. ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలత కనిపిస్తూండగా.. రెండు చోట్ల వైసీపీకి అలాంటి సానుకూలత ఉంది. మరో మూడు స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండనుంది. సాధారణంగా.. తెలుగుదేశం పార్టీకి… శ్రీకాకుళం జిల్లా కంచుకోట లాంటి. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభంజనం వీచినప్పుడు తప్ప… మిగతా సందర్భాల్లో మెజార్టీ సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. ఐదేళ్ల పాలన తర్వాత.. టీడీపీకి కొంత వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ.. జనసేన ప్రభావంతో… ఓట్ల చీలిక వైసీపీకి కలసి వచ్చే అవకాశాలున్నాయి.
జనసేన చీల్చే ఓట్లు టీడీపీకే మైనస్..!
తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానాలనయిన ఎచ్చెర్ల, టెక్కలి, పాతపట్నం, పలాసల్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన రాజం ఎస్సీ రిజర్వుడ్ నియోజవకర్గంలో మాజీ మంత్రి కొండు మురళీ టీడీపీ నుంచి పోటీ చేస్తూండటం… ప్రతిభాభారతి వర్గం కూడా.. విజయానికి సహకరిస్తూండటంతో… అక్కడ గెలుపుబాటలో ఉంది. నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో వైసీపీకి ఆధిక్యం కనిపిస్తోంది. ఆముదాలవలస, ఇచ్చాపురం, పాలకొండల్లో హోరాహోరీ పోరాటం నెలకొంది. అంతిమంగా ఫలితాలను అంచనా వేయవలసి వస్తే.. ఈ సారి వైసీపీ ఇక్కడ ఓ సీటు పెంచుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీకి ఆరు స్థానాలు, వైసీపీకి నాలుగు లభించవచ్చు. అదే సమయంలో.. జనసేన ప్రభావాన్ని తీసి పారేయలేము.. కానీ..సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదని తెలుగు 360 పరిశీలనలో వెల్లడయింది.
నేతల బలంతో.. ఎడ్జ్ సాధించనున్న టీడీపీ ..!
తెలుగుదేశం పార్టీకి బలమైన లీడర్లు ప్లస్ పాయింట్‌గా మారారు. కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు ఇద్దరూ.. పార్టీపై పట్టు సాధించారు. అయితే.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. అదే సమయంలో.. వైసీపీలో ధర్మాన ప్రసాదరావు లాంటి కీలక నేత ఉన్నా… ఆధిపత్య పోరాటం ఎక్కువగా ఉంది. కిల్లి కృపారాణికి అవకాశం రాకపోవడానికి ధర్మానే కారణం అన్న ప్రచారం ఉంది. ఇతర నియోజకవర్గాల్లో కూడా.. గ్రూపులు ఉన్నాయి. ఇవి కొన్ని వైసీపీకి నష్టం చేయనుంది. అన్ని ప్లస్‌లు, మైనస్‌లు బేరీజు వేసుకుంటే.. కొద్దిగా తెలుగుదేశం పార్టీనే పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Srikakulam | Assembly | Win |
---|---|---|
1 | Amadhalavalasa | YCP |
2 | Ichchapuram | YCP |
3 | Narasannapeta | YCP |
4 | Srikakulam | YCP |
5 | Etcherla | TDP |
6 | Palakonda (ST) | TDP |
7 | Palasa | TDP |
8 | Pathapatnam | TDP |
9 | Rajam (SC) | TDP |
10 | Tekkali | TDP |