తెలుగు సంవత్సరాది ఉగాది రానే వచ్చింది. మన్మధనామ సంవత్సరానికి బై బై చెప్పి దుర్ముఖి నామ సంవత్సరానికి స్వాగతం పలికింది. ఇక ఉగాది నాడు ప్రసాదంగా తీసుకునే ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి.. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి జీవితంలో అనేక అనుభవాలను ప్రతీకలుగా వర్ణిస్తారు.
షడ్రుచుల సమ్మేళనంతో తీసుకునే ఉగాది పచ్చడిని కొన్ని శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఉగాది అనే పదం యుగం అనే పదం నుండి వచ్చిందని కొందరంటారు. క్రీస్తు శకం రాకముందు కాలాన్ని శాలివాహన శకంగా పిలవబడేది. ఆ శాలివాహన శకం పుట్టినప్పుడే ఉగాది వచ్చింది అని కొందరంటారు. ప్రపంచంలో తెలుగు వారందరు జరుపుకునే విశిష్ట పండుగ ఈ ఉగాది.. ఉగాది సందర్భంగా తెలుగు360 పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.