ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేద్దామని మార్కింగ్ చేసి హద్దురాళ్లు పాతేసిన ఏపీ సర్కార్‌కు.. హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎక్కడెక్కడ ఆలయ భూముల్ని తీసుకున్నారో.. వాటిని పంచడాన్ని ఆపేయాలని ఆదేశించింది. విజయనగరం జిల్లా గుంపం అనే గ్రామంలోఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు కేటాయించింంది ప్రభుత్వం. ఆ గ్రామస్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం వినలేదు . దాంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చే నిబంధన.. ఎక్కడ ఉందని ప్రభుత్వం తరపు లాయర్‌ను ప్రశ్నించింది.
4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని .. అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని అధికారులను ఆదేశించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోసమంటూ.. ఏపీ సర్కార్.. మైనింగ్ భూములు.. ఆవ భూములు.. చెరువు భూములు.. స్మశానం భూములు ఇలా ప్రతీ వాటిని సేకరించేసింది. అయితే ఇలాంటి భూములపై ఆయా గ్రామాల వాసులు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్న ఇలాంటి స్థలాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందికరం లేదు.
అయితే ఇళ్ల స్థలాలను మాత్రం ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. చట్టంలో అసాధ్యమైన రీతిలో లబ్దిదారులు… ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను అమ్ముకోవచ్చంటూ.. ఆఫర్ ఇచ్చారు. అయితే ఇలా ఇవ్వడం అసైన్డ్ చట్టం కింద సాధ్యం కాదు. డీ పట్టాల రూపంలో ఇస్తే సమస్యే రాదు. కానీ ప్రభుత్వం అలా ఇవ్వకుండా… కోర్టులు అడ్డుకుంటున్నాయంటూ ప్రచారం ప్రారంభించారు. అక్కడే పీట ముడి పడింది. చివరికి ప్రభుత్వం సేకరించిన వివిధ రకాల భూములపై న్యాయస్థానాలు స్టే ఇవ్వడం ప్రారంభించాయి.