మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపడంతో.. ఒకే రాజధాని ఉండాలనుకున్న వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ అది విజయం కాదు. ఆలస్యం మాత్రమే. తర్వాత.. ప్రభుత్వం ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ తల్చుకుంటే…. నిబంధనలకు తనకు అనుకలమైన అర్థం చెప్పుకుని తరలించేయగలదు. తర్వాత కోర్టులు.. ఏమైనా అంటే అననీ అనుకునే ప్రభుత్వం ఉంటే.. ఎవరూ ఏమీ చేయలేరు. కానీ నిబంధనల ప్రకారం వ్యవహరించాలంటే.. ప్రభుత్వం కొద్ది ఆలస్యంగానైనా తన పంతం నెగ్గించుకునే అవకాశం ఉంది.
మూడు నెలలు ఆగే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు..!
సెలక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లాయి కాబట్టి.. వాటిపై ఆర్డినెన్స్ జారీ చేయడం సాధ్యం కాదనేది నిపుణుల అంచనా. సెలెక్ట్ కమిటీ సభ్యులను నిర్ణయించనున్న మండలి నిర్ణయిస్తుంది. సాధారణంగా పదిహేను మందికి మించకుండా సభ్యులు ఉంటారు. కమిటీ అధ్యక్షుణ్ని నియమించనున్న మండలి చైర్మన్ నియమిస్తారు. కమిటీలో సభ్యుడుగా బిల్లు ప్రతిపాదిత సభ్యుడు ఉంటారు. కమిటీ సభ్యులు దానికి సవరణ నోటీసులు ఇవ్వొచ్చు. బిల్లును కమిటీ సమగ్రంగా పరిశీలించి తాను భావించిన సవరించి సభకు సమర్ిస్తారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపకపోతే ప్రవేశపెట్టిన రూపంలో పరిశీలనకు తీసుకుంటారు. చర్చకు వచ్చినపుడు సవరణలు పరిశీలించి ఓటింగ్ జరుగుంది. నిజానికి ఈ సెలక్ట్ కమిటీ ఫలానా సమయంలో.. ఇంత సమయం అనే నిర్దిష్టత ఏమీ లేదు. కానీ మూడు నెలలు పట్టొచ్చని అంటున్నారు.
అసెంబ్లీ స్పీకర్ పవర్ అసాధారణంగా వాడబోతున్నారా..?
ప్రభుత్వం ఈ సమస్యను.. ఇజ్జత్ కా సవాల్‌గా భావిస్తోంది. 153 మంది బలం ఉంటే.. తాము అనుకున్నట్లుగా చేయలేమా అన్న ఈగో సమస్యకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే.. శాసనమండలి ఆమోదం లేకపోయినా… రాజధాని తరలింపు విషయంలో ఆగే ప్రశ్నే లేదని .. నిరూపించడానికి మార్గాలు వెదుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది .. కానీ.. అసెంబ్లీ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు సెలెక్ట్ కమిటీ కి పంపాలనే మండలి నిర్ణయాన్ని ఈరోజు అసెంబ్లీ లో తిరస్కరించాలనే ఆలోచన వైసీపీ వ్యూహకర్తల్లో ఉంది. స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి, బిల్లును మళ్ళీ మండలికి పంపొచ్చని… మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లుపై అభిప్రాయం చెప్పమని అడగవచ్చని వైసీపీ వ్యూహకర్తలు అంటున్నారు. అదే జరిగితే.. వివాదం మరింత పీట ముడి పడుతుంది.
ప్రభుత్వ పట్టుదల..మరిన్ని సమస్యలకు మూలం..!?
మైండ్‌లో అనుకుంటే.. బ్లైండ్‌గా వెళ్లిపోవాలన్న ఏపీప్రభుత్వ వైఖరి కారణంగా.. రాజ్యాంగ పరమైన.. న్యాయపరమైన అనేక సవాళ్లు.. మూడు రాజధానుల విషయంలో తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం వేయబోయే అడుగులతో.. మరిన్ని వివాదాలు కూడా చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల వివాదం.. సింపుల్‌గా అయ్యేది కాదని.. ఎన్నో కొత్త సమస్యలు సృష్టించబోతోందని.. తాజా పరిణామాలతో అర్థం చేసుకోవచ్చు.