రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రాకూడదని కంకణం కట్టుకుని మరీ వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తున్న చానళ్లు రెండే రెండు. ఒకటి టీవీ నైన్, రెండు టెన్ టీవీ. ఈ రెండు రేవంత్ ను ఎందుకు టార్గెట్ చేసుకున్నాయన్నది అందరికీ తెలిసిందే. ఆ చానళ్ల యజమానికి మైహోం గ్రూప్ ఓనర్ రామేశ్వరరావుకు.. రేవంత్ రెడ్డికి ఆగర్భ శత్రుత్వం ఉంది. అది ఎక్కడ ప్రారంభమయిందో తెలియదు కానీ..మీడియాలో చేతికి వచ్చిన తర్వాత రేవంత్ ను ఎంతగా బద్నాం చేయాలో.. అంతగా.. బద్నాం చేసేందుకు రామేశ్వరరావు అండ్ కంపెనీ ప్రయత్నించింది. రేవంత్ భూకబ్జాలంటూ.. గంటల గంటల కథనాలు ప్రసారం చేసింది.
ఇటీవల ఆయన పీసీసీ రేస్‌లో అసలు లేరన్నట్లుగా.. ,ఇతరులెవరికో పీసీసీ చీఫ్ పదవి వస్తోందన్నట్లుగా ప్రసారాలు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చి ఈడీ దగ్గర మత్తయ్య వాంగ్మూలం ఇవ్వగానే మరోసారి రెచ్చిపోయారు. మామూలుగా ఇలాంటి బురద చల్లుడు కార్యక్రమాలకు తప్ప.. రేవంత్ రెడ్డి మొహన్ని పాజిటివ్‌గా చూపించడానికి ఇష్టపడిన టెన్ టీవీ.. ఏకంగా.. రేవంత్ రెడ్డితో ఇంటర్యూనే నిర్వహిస్తోంది. స్టూడియోకు పిలిపించి మరీ .. ఇంటర్యూ ప్రసారం చేస్తోంది. టీవీలో ప్రోమో పడినప్పటి నుండి ఒకటే చర్చ.
రేవంత్ విషయంలో రామేశ్వరరావు వెనక్కి తగ్గారా అన్నదే చర్చ. ఈ విషయంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రేవంత్‌తో రాజీకి రామేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అది నిజమో కాదో కానీ.. టెన్ టీవీలో రేవంత్ ఇంటర్యూ తర్వాత నెక్ట్స్ ఇక టీవీ నైన్లోనే రేవంత్ ప్రత్యక్షమైన ఆశ్చర్యం లేదన్న వాతన.. తాజా డెవలప్మెంట్తో వినిపిస్తోంది.