ముందుకెళ్లకుండా చూడాలని కేంద్ర జలవనరుల మంత్రి కేఆర్ఎంబీని ఆదేశించినా.. కేఆర్ఎంబీ.. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చెప్పినా… రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. ఇప్పుడు టెండర్లను ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభించింది. వైసీపీ సర్కార్ బెంచ్ మార్క్ విధానం అయిన .. రివర్స్ టెండరింగ్ ద్వారా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ప్రాజెక్ట్ వ్యయం.. రూ.6,829.15 కోట్లు. సంగమేశ్వరం వద్ద నిర్మించే ఎత్తిపోతల పథకంతో పాటు కాలువల విస్తరణ కూడ ఈ పథకంలో భాగంగా ఉన్నాయి.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిధులకు పాలనామోదం ఇచ్చారు. మొత్తం రెండు ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. శ్రీశైలం ప్రాజెక్టులోని సంగమేశ్వరం పాయింటు నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసేలా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తారు. పంపుహౌస్‌లు, మోటార్లు, పైపులైన్ల పని అంతా ఒకే ప్యాకేజీగా ఇస్తారు. పోతిరెడ్డి పాడు నుంచి నీటిని తరలించే వివిధ ప్రాజెక్టుల కాల్వన సామర్థ్యం పెంచడాన్ని మరో ప్యాకేజీగా నిర్ణయించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆమోదం చెప్పగానే టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రివర్స్ టెండర్లు కూడా పూర్తయిన తర్వాతనే టెండర్లు ఖరారు చేస్తారు.
ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వివాదాస్పదం అయింది. తెలంగాణ ప్రభుత్వం… కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే.. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకోవావాలని చెబుతోంది. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం.. ఇది పాత ప్రాజెక్టేనని చెబుతూ.. ముందుకెళ్లడానికి నిర్ణయించుకుంది. ఎవరి అభ్యంతరాలనూ పట్టించుకోవాల్సిన పని లేదని వాదిస్తోంది.