పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ పదేళ్ల పాలనపై అంతులేని అవినీతి ఆరోపణలు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ..ఇలా ఏదైనా అవినీతి కోసమే రూపొందించారని ఆరోపణలు మూటగట్టుకున్నారు. ధరణితో లక్షలాది ఎకరాల భూములను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని…ఒక్కో నేత వెయ్యి కోట్లకు తగ్గకుండా సంపాదించారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. 2023లో మళ్లీ అధికారంలోకి వస్తున్నామనే ధీమాతో బీఆర్ఎస్ నేతలు అక్రమంగా సంపాదించిన ఆస్తులను బినామీలకు అప్పగించారని టాక్.
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవర్నీ వదిలి పెట్టకూడదని రేవంత్ సర్కార్ పోలీసులను ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందోనని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తోంది. అందుకే తెలివిగా బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను అమ్మేయాలని లీడర్లు చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బ్లాక్ మనీ అయితే మార్కెట్ రేట్ కంటే 30% తక్కువకే అమ్మేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను అమ్మేసి.. బెంగళూరు, గోవా, ఢిల్లీలో ఆస్తులను కొనుగోలు చేస్తున్నారని… ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీ, బిజీగా ఉండటంతో ఈ పర్వం ముగిసిన వెంటనే బినామీ ఆస్తులను అమ్మేసే ప్లాన్ లో ఉన్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది.