హైదరాబాద్: పాకిస్తాన్లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దేశ వాయువ్యప్రాంతంలో పెషావర్ నగరానికి సమీపంలో ఉన్న బచాఖాన్ విశ్వవిద్యాలయంపై దాడి చేశారు. 20 మందికి పైగా ఈ దాడిలో చనిపోయారు… 50 మంది దాకా గాయపడ్డారు. యూనివర్సిటీ క్యాంపస్లోన ఒక పాఠశాలలో ఒక సభ జరుగుతుండగా ఉగ్రవాదులు దాడిచేసి విచక్షణారహితంగా కాల్పులు జరపారు. పోలీసులు, పాక్ సైన్యం, స్పెషల్ ఫోర్స్ దళాలు రంగంలోకి దిగి నేలపైనుంచి, ఆకాశమార్గంనుంచి ప్రతిదాడి ప్రారంభించాయి. నలుగురు తీవ్రవాదులను మట్టుపెట్టినట్లు చెబుతున్నారు. మొత్తం ఏడుగురు తీవ్రవాదులు క్యాంపస్‌లోకి ప్రవేశించి దాడులకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. దాడి చేసింది తాలిబన్ సంస్థ అయి ఉండొచ్చని భావిస్తున్నారు.