ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక దేశంలో ఉగ్రవాదుల దాడులు సర్వసాధారణమయిపోయాయి. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధాని ఔగాడుగులో ‘స్ప్లెండిడ్ హోటల్’ అనే ఒక ఫోర్ స్టార్ హోటల్ పై ఉగ్రవాదులు బాంబులతో దాడికి పాల్పడి హోటల్లో ఉంటున్న అనేక మందిని తమ అధీనంలోకి తీసుకొన్నారు. ఉగ్రవాదుల దాడిలో కనీసం 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబందంగా పనిచేస్తున్న ఏ.క్యూ.ఐ.ఎమ్. ఉగ్రవాద సంస్థ తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకొంది. స్ప్లెండిడ్ హోటల్లో సాధారణంగా యూరోప్ దేశస్తులు ఎక్కువగా బస చేస్తుంటారు. ప్రస్తుతం హోటల్లో దాకొన్న ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది.