జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్ లో ఇటీవల కాలంలో తరచూ ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. శనివారం మద్యాహ్నం పాంపోర్ అనే ప్రాంతంలో పాంపోర్ అనే ప్రాంతంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలో ఆనుకొని ఉన్న జమ్మూ కాశ్మీర్ ఎంటర్ ప్రెన్యువర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ భవనం వద్ద కొందరు ఉగ్రవాదులు ఆ దారిన వెళుతున్న సి.ఆర్.పి.ఎఫ్. వాహనంపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆ దాడిలో ఒక జవాను అక్కడికక్కడే మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది.
దాడి చేసిన తరువాత ఉగ్రవాదులు పక్కనే ఉన్న ఆ భవనంలోకి పారిపోయి దాక్కొన్నారు. ఆ భవనంలో సుమారు వందమంది విద్యార్ధులు, 50 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన జరిగిన వెంటనే భద్రతాదళాలు అక్కడికి చేరుకొని ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. ఆ భవనంలో ఉన్న విద్యార్ధులు, సిబ్బందిలో చాలా మంది సురక్షితంగా బయటపడ్డారు. లోపల ఇంకా మరికొంత మంది ఉండిపోయారు. శ్రీనగర్ లోని పుల్వామా జిల్లాలోని పాంపోర్ అనే పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.