ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. టెర్రరిజం చాలా వరకూ తగ్గింది. టూరిజం ఊపందుకుంది. పర్యాటకులు స్వేచ్చగా కశ్మీర్‌కు వెళ్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల ముఫ్పై లక్షల మంది కశ్మీర్ లో పర్యటించారు. అంతే ప్రశాంతంగా ఉంటే ఈ ఏడాది రెట్టింపు అవుతుందని రిపోర్టులు చెబుతున్నాయి. అక్కడి ప్రజలు టూరిజం ద్వారా ఆదాయం పొందుతున్నారు. జీవన ప్రమాణాలు పెంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జరిగిన ఈ దాడి మొత్తం పర్యాటక రంగాన్ని కుదేలు చేసే అవకాశం ఉంది.
కశ్మీర్ లో టెర్రరిస్టులు భద్రతా దళాలను టార్గెట్ చేస్తారు కానీ పర్యాటకుల జోలికి రారన్న ఓ అభిప్రాయం ఉంది. ఇలా పర్యాటకుల్ని నిలబెట్టి కాల్సేసిన ఘటనలు గతంలో లేవు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా పర్యాటకుల్ని టార్గెట్ చేశారు. అంటే.. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులుక భయం కల్పించి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని అనుకోవచ్చు.
కశ్మీర్ ప్రజలకు..సాధారణ భారత ప్రజలకు మధ్య ఆర్టికల్ 370 ఓ అడ్డంకిగా ఉండేది. అది తీసేసిన తర్వాత అంతా సమానం అయ్యారు. కశ్మీర్ ప్రజలకు అన్ని అవకాశాలు లభిస్తారు. కశ్మీర్ కు పెట్టుబడులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడి ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే.. పూర్తిగా మారిపోతారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి అసలు సపోర్టు చేయరు. మత బేధాలు కూడా లేకుండా భారత్‌లో కలసిపోతారు. దాని వల్ల ఉగ్ర కుట్రలు ఇక ముందుకు సాగవు. అందుకే వ్యూహాత్మకంగా టూరిస్టులను టార్గెట్ చేశారని నిపుణుల భావన.