ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం.. టెస్లా ఇండియాలో ప్లాంట్ పెట్టాలని డిసైడయింది. కొరియా కార్ల కంపెనీ కియా ఏపీలో శరవేగంగా ప్లాంట్ ప్రారంభించడంతో… అదికూడా ఏపీకే వస్తుందని చాలా మంది ఆశించారు. కానీ… ఏపీకి రాలేదు. పొరుగున ఉన్న కర్ణాటకలోనే ఆగిపోయింది. తమ హెడ్ క్వార్టర్‌గా బెంగళూరును ఎంచుకున్న టెస్లా.. ప్లాంట్ ను కూడా అక్కడే నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం యడ్యూరప్ప అధికారిక ప్రకటన చేశారు. టెస్లా ప్లాంట్ కోసం 75ఏళ్లు దాటిన ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. రాజకీయంగా లాభనష్టాలు ఆలోచించకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడి… తమ రాష్ట్రానికి ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజాన్ని తెచ్చుకున్నారు.
ఎలన్ మస్క్. ఈ పేరు తెలియని వారు ఇప్పుడు ప్రపంచంలో లేరని చెప్పుకోవాలి. ఒకప్పుడు బిల్ గేట్స్ కంప్యూటర్ రంగంలో సృష్టించిన సంచలనాలను ఇప్పుడు ఎలన్ మస్క్ ఇతర రంగాల్లో సాధిస్తున్నారు.. ఆయనకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా తో పాటు అంతరిక్షాన్ని టార్గెట్ చేసిన స్పేస్ ఎక్స్అనే కంపెనీని కూడా నడుపుతున్నారు. ఆయన వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసంతృప్తి వ్యక్తం చేసి… సిగ్నల్ యాప్ ను వాడుకోవడం మంచిదని ఒక్క మాట చెప్పినందుకు… ప్రపంచవ్యాప్తంగా … సిగ్నల్ డౌన్ లోడ్లు పెరిగిపోయాయి. వాట్సాప్ కు పోటీగా దూసుకొచ్చేసింది. అప్పటి వరకూ అ యాప్ ఉందని కూడా… 99శాతం మందికి తెలియదు. అంత క్రేజ్ ఉన్న ఎలన్ మస్క్ … టెస్లా కంపెనీని బెంగళూరులో పెట్టాలని డిసైడయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టెస్లా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అయినా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. అమెరికా పర్యటనలో టెస్లా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఏపీ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ రాష్ట్రానికి వస్తే..ఎలాంటి ప్లస్ పాయింట్లు వస్తాయో వివరించారు. అప్పట్లో.. ఏపీకి తమ ప్రతినిధి బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత టెస్లా ఇండియాలోకి ఎంటర్ అవ్వాలని అనుకున్న తరవాత… కనీసం టెస్లాతో సంప్రదింపులు కూడా చేయలేదు. కియా పరిశ్రమ ఏర్పాటుతో వచ్చిన పాజిటివ్ ఇమేజీని ఉపయోగించుకుని టెస్లా ప్లాంట్ ను ఆకర్షించడంలో ఏపీ ఫెయిలయింది.