వైసీపీ కాపు మంత్రులు.. తమ జాతి అని తెగ ఆవేశపడిపోతూ ఉంటారు. అయితే అవి తమ జాతి ప్రయోజనాల కోసం కాదు…పవన్ కల్యాణ్‌పై మాటల దాడి చేసే విషయంలోనే. నిజంగా వారు చెప్పుకునే తమ జాతి విషయంలో మాత్రం వారి పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. ఇప్పుడు వారికి అసలైన టెస్ట్ ఎదురవుతోంది. ఈడబ్ల్యూెస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కోర్టు సరైనవేనని తీర్పు ఇచ్చింది. ఆ రిజర్వేషన్లు గతంలో ఏపీలో అమలు చేశారు. వాటిలోనే ఐదు శాతం కాపులకు చంద్రబాబు ప్రభుత్వం కల్పిచింది. కానీ జగన్ సర్కార్ వచ్చాక…స్వయంగా చెల్లవు అని తీర్పు ఇచ్చుకుని తీసేసింది.
నిజానికి చెల్లవు అని కోర్టులు చెప్పలేదు. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి.. మొత్తం ప్రక్రియ పూర్తి చేసింది. సర్టిఫికెట్ల జారీ కూడా ప్రారంభించింది. అయితే ప్రభుత్వం మారగానే వారి చిరకాల కోరిక అయిన రిజర్వేషన్లకు జగన్ మంగళం పాడేశారు. అయితే ఒక్కరు కూడా నోరెత్తలేదు. ముద్రగడ పద్మనాభం కూడా ప్రశ్నించలేదు. జగన్‌పై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో అవి మరుగున పడిపోయాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ల విషయంలో కీలకమైన తీర్పు ఇచ్చింది.దీంతో ఏపీలోనూ కాపు రిజర్వేషన్లపై చర్చ ప్రారంభమయింది.
కాపు రిజర్వేషన్లు చాలా సున్నితమైన అంశం. తెలుగుదేశం హయాంలో రైళ్లను కూడా తగబెట్టిన పరిస్థితులు ఏర్ర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల నుంచి అతి కష్టం మీద రిజర్వేషన్లు కల్పించినా .. తర్వాత తీసేసినప్పటికీ ఎందుకుఎవరూ పెద్దగా స్పందించలేదో తెలియదు కానీ అది కాపు వర్గానికి తీవ్ర నష్టం చేస్తోంది. ఇప్పుడు వైసీపీ కాపు మంత్రులు పవన్ కల్యాణ్‌పై దాడి విషయంలో యాక్టివ్‌గా ఉన్నారు. అంతే యాక్టివ్ నెస్ కాపు రిజర్వేషన్ల విషయంలో చూపిస్తారో లేదో వేచి చూడాల్సింది. ఒక వారు ఇప్పుడు నోరెత్తకపోతే.. ఇంకెప్పటికీ కాపులకు రిజర్వేషన్లు దక్కకపోవచ్చు. గొప్ప అవకాశాన్ని కాలదన్నుకున్నట్లే.