కరోనా వైరస్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుంది. దిని ప్రభావం అన్ని రంగాలపై పడింది. సినిమా రంగమైతే ఈ వైరస్ దాటికి కుప్పకూలింది. కరోనా హైరానా టాలీవుడ్ పై కూడా తీవ్రంగా పడింది. ప్రేక్షకులు కరోనా భయంతో థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. నిన్న కేసీఆర్ ప్రభుత్వం థియేటర్లు మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటింకింది.
తెలుగురాష్ట్రాల్లో కరోనా కేసులు బయటపడ్డంతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు కూడా విడుదల తేదిలని మార్చేశాయి. అది ఎప్పుడో చెప్పడం లేదు. ఇక సమ్మర్ కి రావాల్సిన సినిమాల షూటింగులు కూడా నిలిపేశారు. ‘ఆచార్య’ షూటింగ్ ఆపేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. అలాగే సమ్మర్ కి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఇప్పుడు అంతా గందరగోళంగా వుంది.
సినిమా విడుదల వాయిదా పడటం మామూలు విషయమే. అయితే ఇలా మూకుమ్మడిగా సినిమాలు నిలిచిపోవడం చిత్ర పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇపుడు వాయిదా పడిన సినిమాలకు మళ్ళీ ఒక డేట్ కావాలి. అయితే అప్పటికే ఫిక్స్ చేసిన ప్లాన్ ప్రకారం.. అనుకున్న డేట్ దొరకదు. ప్లాన్ మొత్తం చెడిపోతుంది. ఇది నిర్మాతలపై పెను భారం. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. ఏ ఒక్క సినిమా విడుదల తేది పక్కగా చెప్పలేని స్థితి దాపురించింది.