ప్రముఖ కంపెనీ అమర్ రాజాపై తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ నుండి అమర్ రాజా వెళ్లిపోతుందా? ప్రభుత్వం నుండి సహకారం లేకే పోతుందన్న విమర్శలపై స్పందించారు.
అమర్ రాజా ఆనాడు తెలంగాణ వచ్చినప్పుడు అది కేటీఆర్ విజయంగా చెప్పుకున్నా… ఆ కంపెనీ ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు, అక్కడి ప్రభుత్వం ఇబ్బంది పెడితే తెలంగాణకు వచ్చారే తప్పా కేటీఆర్ శ్రమించి తెచ్చింది కాదని స్పష్టం చేశారు.
ఇక అమర్ రాజా తెలంగాణ నుండి వెళ్లిపోకుండా మాట్లాడుతామని… ఆ కంపెనీకి ఉన్న ఇబ్బందులు, ప్రభుత్వం నుండి సౌకర్యాలు కల్పించాల్సి వస్తే ఎంత వరకు వీలుంటుంది, ప్రభుత్వం-కంపెనీతో చర్చించి నిర్ణయాలుంటాయన్నారు.
ప్రతిపక్షాల విమర్శలకు తాము వెనక్కి తగ్గమని… ఇది రేస్ కాదు, తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో చేస్తున్న కృషి అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.