తిరుమల శ్రీవారికి వస్తున్న ఆదాయం మొత్తాన్ని రాయలసీమలోనే ఖర్చు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేస్తున్నారు. తన వాదనకు మద్దతుగా విజయవాడ, సింహాచలం ఆలయాల డబ్బు ఆ ప్రాంతాలకే ఖర్చు చేయాలని కూడా.. అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యేకంగా సీమ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తూండటంతో… టీజీ వెంకటేష్.. మరింత అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. ఆయన కొంచెం దూకుడుగానే రాయలసీమ అంశాలను మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ ఇప్పుడు.. సీమ విషయంలో… ప్రత్యేకంగా ఉండటంతో.. దాన్ని టీజీ వెంకటేష్ మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా సీమలో హక్కుల సంఘాలు, ఉద్యమ సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రాయలసీమ నీళ్లను ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని… కూడా టీజీ వెంకటేష్ అంటున్నారు. గోదావరి జలాలు కృష్ణా ప్రాంతానికి ఇచ్చి.. రాయలసీమకు రావాల్సిన నీళ్లను ఇస్తామని నాడు వైఎస్ చెప్పారని.. కానీ ఇంత వరకు అమలు కాలేదని అంటున్నారు. కేంద్రం నిధులతో ప్రాజెక్టులను స్పీడ్ బ్రేకర్లు లేకుండా పూర్తి చేయాలని.. అలా చేస్తేనే సీమకు నీళ్లొస్తాయని ఆయనంటున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి.. తన మేనిఫెస్టో ప్రకారం.. పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్నారని.. ఆదాయం మొత్తం అక్కడే ఖర్చయిపోతోందంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని విషయంలో టీజీ వెంకటేష్.. కొన్ని కీలకమైన వ్యాఖ్యలను కొద్ది రోజులుగా చేస్తున్నారు. జగన్ నాలుగు రాజధానులు చేయబోతున్నారన్న ప్రచారాన్ని ఆయనే ప్రారంభించారు. అయితే.. ఆ తర్వాత వాటిని ప్రాంతీయ బోర్డులుగా మార్చారు. ఇప్పుడు.. ప్రాంతీయ బోర్డు డిమాండ్ ను బీజేపీ అందుకుంది. ప్రాంతీయబోర్డులను ఏర్పాటు చేసి.. రూ. 20వేల కోట్లను రాయలసీమకు కేటాయించాలన్న డిమాండ్ ను వినిపిస్తున్నారు. అదే సమయంలో.. అమరావతి ఫ్రీజోన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ సీమ వాదంలో.. మరో ప్రత్యేకమైన వాదాన్ని టీజీ వెంకటేష్ మరింత జోరుగా ముందు ముందు వినిపించే అవకాశం కనిపిస్తోంది.