రవితేజ ఈగల్ సక్సెస్ మీట్ హాట్ హాట్ గా జరిగింది. వేదికపై దర్శకుడు హరీష్ శంకర్ ఓ వెబ్ సైట్ పిచ్చిరాతలపై విరుచుకుపడ్డాడు. అయితే ఇదే వేదికపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన ఓ కామెంట్ కూడా ఆసక్తికరంగా వుంది. ‘ఈగల్ సినిమాని ప్రోమోట్ చేయడానికి ఓ వెబ్ సైట్ చాలా హెల్ప్ చేసింది. కొద్దిరోజుల్లో మా నిర్మాతలందరితో మాట్లాడి ఆ వెబ్ సైట్ కి ఎలా రివార్డ్ చేయాలో ఆలా చేస్తాం’ అన్నారు. ఆయన మాటల్లో ఒక శ్లేష, సెటైర్, వార్నింగ్ కనిపిస్తున్నాయి. ఒక నిర్మాత తన సినిమాకి హెల్ప్ చేసిన వెబ్ సైట్ కి రివార్డ్ ఇవ్వాలనుకుంటే పరిశ్రమలోని నిర్మాతలందరితో మాట్లాడి ఇవ్వడం ఏమిటి ? ఇక్కడే ఆయన అసలు ఉద్దేశం తెలిసిపోతుంది.”ఒక వెబ్ సైట్ ఈగిల్ సినిమాని కిల్ చేసేవిధంగా పిచ్చిరాతలు రాసింది. కొద్దిరోజుల్లో నిర్మాతలందరితో మాట్లాడి ఆ వెబ్ సైట్ కి తగిన బుద్ధి చెబుతాం’ ఇదీ విశ్వ ప్రసాద్ ఇన్నర్ వాయిస్ అని చెప్పొచ్చు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వంద సినిమాలు చేయాలనే సంకల్పంతో వచ్చారు విశ్వప్రసాద్. నిజానికి పరిశ్రమకు మేలు కలిగించే గొప్ప సంకల్పం ఇది. కానీ ఓ వెబ్ సైట్ వ్యక్తిగత ఎజెండాతో సినిమాని కిల్ చేసే విధంగా ప్రవర్తించి జనాలతో కూడా చీవాట్లు తింటుంది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే తీరుగా బ్లాక్ మెయిలింగ్, గాసిప్ కంటెంట్ తో నడుస్తున్న సదరు సైట్ ని బ్యాన్ చేయలనే డిమాండ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వుంది. ఈసారి టీజీ విశ్వప్రసాద్ యాక్షన్ లోకి దిగారు. ఆయన మంచి విల్ పవర్ వున్న నిర్మాత. బ్రో వివాదం సమయంలో ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వాన్నే చాలా కూల్ గా ఎదుర్కున్నారు. ఇప్పుడీ విషయంలో కూడా ఆయన బలంగా నిలబడితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం వుంది.