సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన మూడేళ్లకుపైగానే ప్రస్తుత పోస్టులో ఉన్నారు. ఆయన సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే ఆయన నేతృత్వంలోనే దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిందనే ప్రచారం ఉంది. ఆ ఘటనపై విమర్శలు ఉన్నా.. దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. మంచి ఆఫీసర్‌గా పేరు కూడా లభించింది
సైబరాబాద్ కొత్త కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది. స్టీఫెన్ రవీంద్ర రెండేళ్ల క్రితం ఏపీకి డిప్యూటేషన్ పై వెళ్లాలనుకున్నారు. అక్కడ ఆయనకు ఇంటలిజెన్స్ చీఫ్ పోస్ట్ ఇవ్వాలని సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో జగన్ అనుకున్నారు. స్టీఫెన్ రవీంద్రతో పాటు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కూడా డిప్యూటేషన్‌పై ఏపీకి పంపాలని డివోపీటీకి దరఖాస్తు చేశారు. తెలంగాణ సర్కార్ కూడా అంగీకరించింది. ఆ తర్వాత అనధికారికంగా కొంత కాలం ఏపీలో స్టీఫెన్ రవీంద్ర పని చేశారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వివిధ రకాల అభ్యంతరాలతో ఆలస్యం అయింది. తర్వాత ఆయన వెళ్లిమళ్లీ తెలంగాణ విధుల్లో చేరిపోయారు. ఏడాది తర్వాత ఆయన డిప్యూటేషన్‌కు అనుమతి వచ్చినా.. స్టీఫెన్ మాత్రం ఏపీలో కాకుండా తెలంగాణలోనే ఉండాలని నిర్ణయించుకుని.. కొనసాగుతున్నారు. ఇప్పుడాయనకు సైబరాబాద్ కమిషనర్ పదవి దక్కింది.
సైబరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్ అనేక వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డితో కలిసి డేటాచోరీ లాంటికేసులను పెట్టి ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో టీడీపీ నేతలు కూడా సజ్జనార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. . తెలంగాణ ప్రభుత్వ పెద్ద ఆశీస్సులు మెండుగా ఉన్న ఆయనకు ప్రాధాన్యత గల ఆర్టీసీ ఎండీ పదవినే దక్కింది. నిన్ననే ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా సైబరాబాద్ కమిషనర్‌ను కూడా బదిలీ చేయడం అధికారవర్గాలలోనూ చర్చనీయాంశం అవుతోంది.