వెంకట్ ప్రభుతో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ .. రికార్డ్ బ్రేకింగ్ రేమ్యునిరేషన్ తీసుకోబోతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయిలు ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడు విజయ్. ఇదొక సరికొత్త చరిత్ర. ఏ ఇండియన్ హీరో ఇప్పటివరకు ఇంత పారితోషికం తీసుకోలేదు.
దిల్ రాజు తో చేసిన వారసుడు సినిమాకి 140 కోట్లు తీసుకున్నరాని టాక్. ఇప్పుడు చేస్తున్న లియో సినిమాకి 180కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు మరో ఇరవై కోట్లు కలిపి 200 కోట్లుగా తన పారితోషికాన్ని తీసుకుంటున్నాడు విజయ్.
విజయ్ సినిమాలకి ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే దాదాపు 250 కోట్ల రూపాయిలు వచ్చేస్తాయి. అలాగే తన సినిమా ఫ్లాప్ అయినా సరే ఈజీగా వందకోట్లు కలెక్ట్ చేస్తుంది. అందుకే విజయ్ కి ఇంత క్రేజ్. ఈ క్రేజ్ ని ద్రుష్టిలో పెట్టుకునే ప్రతి సినిమాకి పెంచుకుంటూ ఏ హీరోలకి అందనంత ఎత్తులో వెళుతున్నాడు విజయ్.