తరుణ్ భాస్కర్ సినిమాలే కాదు ఆయన మాటలు కూడా వాస్తవానికి దగ్గరగా వుంటాయి. మూడో సినిమాగా ఆయన తీసిన ‘కీడాకోలా’ నవంబర్ 3న విడుదలౌతుంది. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు తరుణ్ భాస్కర్.
‘పెళ్లి చూపులు’ సినిమాపై ఆయన చేసిన కామెంట్ చాలా బోల్డ్ గా వుంది. ‘పెళ్లి చూపులు’ నా వరకూ పెద్ద బోరింగ్ సబ్జెక్ట్. రొమాంటిక్ కామెడీలు రాయడం, తీయడం నాకు ఇష్టం వుండదు. మరో ఆప్షన్ లేకపోవడంతో ఆ సినిమా చేయాల్సివచ్చిందన్నారు.
”ఈ నగరానికి ఏమైయింది” పై సినిమా చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా వున్నాయి. జాతీయ అవార్డ్ రావడం .. నాపై భారాన్ని పెంచింది. ఆ భారాన్ని దిమ్చుకోవాలంటే అర్జెంట్ గా ఓ ఫ్లాఫ్ కొట్టాలి. ఆ ప్రయత్నంలో చేసిన సినిమానే ఈనగరానికి. కానీ అనుహ్యుంగా ఆ సినిమా ప్రేక్షకులు నచ్చింది. ఇంకా భారాన్ని పెంచిందని చెప్పారు.
ఇక ఫిల్మ్ మేకింగ్ పై ఆయన చేసిన వాఖ్యలు కూడా బావున్నాయి. ”ఫిల్మ్ స్కూల్స్ నుంచి వచ్చిన ప్రతివాడికి ఒక ఈగో వుంటుంది. అకిరా కురసోవా ఎవడు? వాడిని కొట్టే సినిమా తీస్తా అనే పొగరు గర్వం కనిపిస్తుంది. మొదట్లో నాలో కూడా ఇవి వున్నాయి.అయితే అనుభవం పెరిగినకొద్ది.. ఒక ఒక నిజం బోధపడింది. మనం ఏం చేసినా ఆడియన్స్ ని అలరించాలి. వాళ్ళని నవ్వించాలి. ఎంటర్ టైన్ చేయాలి. ముందు దానిపై ద్రుష్టిపెట్టాలని తెలుసుకున్నాను”అని తన మనసులోని మాటలని ఎలాంటి సెన్సార్ లేకుండా పంచుకున్నారు తరుణ్ భాస్కర్.