సినిమా వాళ్లకు రివ్యూ రైటర్లపై ఎప్పటి నుండో ఫ్రస్ట్రేషన్. సినిమా బావుందని మెచ్చుకుంటే ఓకే. కాని ఇది ఇలా కాకుండా అలావుంటే ప్రేక్షకులు ఇంకా ఎంజాయ్ చేసే అవకాశం వుందని చిన్న సూచన చేస్తే మాత్రం ఎక్కడలేని ఫ్రస్ట్రేషన్ పుట్టుకొస్తుంది. లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ కి కూడా ఇలాంటి ఫ్రస్ట్రేషనే వచ్చింది. ”రివ్యూలు ఇస్తున్న వారికి స్క్రీన్ ప్లే, ఫిలిం మేకింగ్ ఏం తెలుసు. జీరో నాలెడ్జ్ ఫెలోస్. ఏదో ఒక రోజు తాను రివ్యూలు రాసే వారిపై రివ్యూలు రాస్తా” అంటూ తెగ ఫైర్ అయిపోయాడు. అయితే ఇప్పుడాయని తత్త్వం బోధపడింది. తనకు ఎలాంటి అనుభవం లేకుండా తీసిన సపెళ్లి చూపులను ఆకాశానికి ఎత్తిన విమర్శకులు.. ఇప్పుడు ఈ నగరానికి ఏమైయింది సినిమాకి కొన్ని సూచనలు చేశారంటే.. తన మంచికే కదా అని ఫీల్ అయినట్లువున్నాడు. అందుకే తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ సక్సెస్ మీట్ లో మాట్లాడాడు
”పెళ్లి చూపులు సినిమాకు మీడియా సపోర్ట్ మర్చిపోలేను…ఆ సినిమా రిలీజ్ కి ముందే మంచి రివ్యూస్ రాశారు. మీడియా సపోర్ట్ తోనే ఆ సినిమా అంత విజయం సాధించింది. ఈ సినిమాకు కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఒకటి రెండు సైట్స్ లో రేటింగ్ తక్కువ ఇచ్చిన బాగా రాసారు. ఇక ఇటీవలే రివ్యూ ల గురించి నేనొక పోస్ట్ పెట్టాను. దానికి రీజన్ కొన్ని సైట్స్ లో టెక్నీకల్ గా మాట్లాడారు. ముఖ్యంగా లైటింగ్…కెమెరా వర్క్ గురించి మాట్లాడటం కాస్త బాధ కలిగించింది. అందుకే ఆ పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ కేవలం ఒకరిద్దరినీ దృష్టిలో పెట్టుకునే పోస్ట్ చేశా” అని చెపుకొచ్చాడు తరుణ్. మొత్తనికి తరుణ్ భాస్కర్ కి తత్త్వం బోధపడినట్లువుంది.