అచ్చెన్నాయుడుపై దాఖలు చేసిన చార్జిషీటును ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దానిపైనే ఏమీ తేల్చుకోలేకపోతున్న సీఐడీ.. తగుదునమ్మా అంటూ..ఐఆర్ఆర్ కేసులో చార్జిషీటు అంటూ ఏసీబీ కోర్టు ముందుకు వచ్చింది. ఆ చార్జిషీటు పేరుతో నీలి, కూలీ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దీరా చూస్తే.. ఏసీబీ కోర్టు ఆ చార్జిషీటును పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు సీఐడీకి సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవడం ఒక్కటే చాయిస్. అలా తీసుకోవాలంటే చాలా న్యాయపరమైన సమస్యలు వస్తాయి .
ఇప్పటి వరకూ అనుమతి తీసుకోకుండానే అన్నీ చేసేశారా.. ఇరప్పుడు అనుమతి ఇవ్వాలా అన్న ప్రశ్నలు వస్తాయి. ఇప్పటి వరకూ పెట్టిన కేసులు.. విచారణలు అన్నీ తేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే సీఐడీ ఇప్పుడు .. అలా అనుమతి తీసుకోకుండా.. చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేలా పాత కేసుల తీర్పులు ఏమనా ఉన్నాయా అని వెదుకుతున్నారు. కానీ అలాంటివేమీ లేవని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే అసలు లేని.. ఒక్క ఎకరం కూడా సేకరించని.. రూపాయి ఖర్చు పెట్టని ఐఆర్ఆర్ లో అవినీతి ఏమిటని టీడీపీ ఇప్పటికే తమ వాదన వినిపించింది.
తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఒక్క సాక్ష్యం కూడా లేదని అంటున్నారు. ఇప్పుడు అసలు చార్జిషీట్నే పరిగణనలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడంతో సీఐడీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తప్పుడు కేసులు.. తప్పుడు ప్రచారాల ఎజెండాకు దిగే వారికి .. సరైన బుద్ది చెబుతామని టీడీపీ నేతలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.