జిల్లాకో ఎయిర్ పోర్టు పెట్టాలని సీఎం జగన్ డిసైడయ్యారు. వాటికిఎంత ఖర్చు పెడతారో తెలియదు కానీ.. ఉన్న ఎయిర్ పోర్టులకు విమానాలు తిరగాలంటే.. ఒక్క విమానయాన సంస్థకు ఏటా రూ. ఇరవై కోట్లు చెల్లించక తప్పడం లేదు. విమానాలు తిరగకపోతూండటంతో ప్రభుత్వం ఎలాగైనా వాటిని ఆపరేషన్‌లో ఉంచాలని ప్రయత్నిస్తోంది. అందు కోసం… ఎదురు డబ్బులు పెట్టి విమానాలు తిరిగేలా ఇండిగో సంస్థతో ఒప్పందం చేసుకుంటోంది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో కడప, కర్నూలు విమానాశ్రయాలు ప్రారంభమయ్యాయి. కడప నుంచి టీడీపీ హయాంలో.. కర్నూలు నుంచి వైసీపీ హయాంలో కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కానీ సర్వైవ్ కాలేకపోయాయి. సరిపడినంత ట్రాఫిక్ లేకపోవడంతో సర్వీసులు నడిపేందుకు ఎయిర్ లైన్స్ ఆసక్తిచూపటం లేదు. ప్రారంభించినవి కూడా ఆపేశాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇండిగో ఎయిర్ లైన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఏటా 20 కోట్ల రూపాయలు చెల్లించనుంది.
విజయవాడకు అంతర్జాతీయ విమానాశ్రయం హోదా వచ్చినా.. ఒక్క విమానం కూడా అలాంటి సర్వీసు లేదని గత ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో ఓ విమానానికి అనుమతి ఇచ్చింది. సింగపూర్‌కు అప్ అండ్ డౌన్ ఆ విమానం తిరిగేది. అయితే విమానం తిరిగినంత కాలం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఏపీ ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కట్టాల్సిన అవసరం రాలేదు. అంత సక్సెస్ అయిది ఆ సర్వీస్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటిలాగే ఆ సర్వీసు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు దేశీయ విమానాలు నడపడటానికే ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ .. అది కూడా రూ. 20 కోట్ల ఫిక్స్డ్ అమౌంట్ కట్టడానికి రెడీ అయిపోవడం.. రివర్సే మరి !