జనాభా లెక్కలు పూర్తయ్యే వరకూ జిల్లాల సరిహద్దులు మార్చవద్దని కేంద్రం ఆదేశిచిందని ఓ వైపు ప్రచారం జరుగుతూంటే ఏపీ ప్రభుత్వం మాత్రం జూన్ 30 లోపు మార్చుకోవాలని చాన్సిచ్చిందని చెబుతోంది. జిల్లాలను దగ్గరుండి విభజన చేస్తున్న సీఎం జగన్కు అత్యంత విశ్వసనీయమైన అధికారి విజయ్ కుమార్ ఈ మాటలు చెబుతున్నారు. జనాభా లెక్కలు కరోనా కారణంగా ఆలస్యమయ్యాయని .. జిల్లాల సరిహద్దుల్ని మార్చే విషయంలో కేంద్రం జూన్ ముప్పై వరకూ గడువు ఇచ్చినా తాము ఏప్రిల్లోనే పూర్తి చేస్తామంటున్నారు.
జిల్లాలపై వస్తున్న అభ్యంతరాలను కూడాఆయన జిల్లాలు తిరిగి పరిశీలిస్తున్నారు. నివేదిక సమర్పిస్తామని తెలిపారు. విజయ్ కుమార్ ఇప్పటికే అన్నీ జిల్లాలు తిరిగేశారు. ఒక్క నెల్లూరు మాత్రం పెండింగ్ ఉంది. ఎందుకంటే అక్కడ వైసీపీలో ఓ రేంజ్ రాజకీయం జరుగుతోంది. అక్కడ అభ్యంతరాలను కూడా విజయ్ కుమార్ పరిష్కరిస్తారు కాకపోతే ముందుగా వైసీపీ పెద్దలు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రాజకీయంగా ఎలాంటి సమస్యలు రాకుండా.. వచ్చిన తమకే అడ్వాంటేజ్ ఉండేలా జిల్లాల విభజన ప్రభుత్వం చేసుకుంటోంది.
మరో వైపు కేంద్రం ఆమోదం అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. మామూలుగా అయితే అవసరం లేదమోకానీ ఇప్పుడు జిల్లా సరిహద్దులు మార్చవద్దన్న ఆదేశాలు ఉన్నకారణంగా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు జూన్ నెలాఖరు వరకూ చాన్సిచ్చారని అధికారులు చెబుతున్నారు. ఏది నిజమో కానీ జిల్లాల తుది నిర్ణయం రచ్చ కాకుండా ఉండే అవకాశం లేదంటున్నారు.