ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు కారణంగా గతంలో ఎప్పుడూ లేనంతగా.. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో సపోర్టు లభించింది. దేశంలో ఉన్న ప్రముఖ ఆర్థిక వేత్తలంతా.. ఎక్కువగా ఏపీకి మేలు జరిగిందని విశ్లేషిస్తున్నారు. మేధావులు కాకపోయినా సమాన్య తెలివి తేటలు ఉన్న వారు అయినా సరే.. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ పదవుల్ని త్యాగం చేసి అయినా సరే మంచి ప్యాకేజీని రాష్ట్రం కోసం సాధించగలిగింది.
అమరావతికి ఊపిరి
జగన్ రెడ్డి అమరావతి పీక నొక్కడానికి చేసిన ప్రయత్నాలు దాదాపుగా సఫలమైన దశలో.. ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారు. ఇప్పుడు అమరావతికి ఫీనిక్స్ లాగా మళ్లీ ఎదగడానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని ప్రకటించిది. అది గ్రాంట్ అయినా.. అప్పు అయినా.. నేరుగా అలోకేట్ చేసినా.. సరే అమరావతికి పదిహేను వేల కోట్ల అందబోతున్నాయి. ఏ రూపంలో ఇచ్చినా కేంద్రమే అత్యధికంగా తిరిగి చెల్లిస్తుంది. అమరావతికి ఎప్పుడో పునాదులు పడ్డాయి. కాబట్టి అక్కడ్నుంచి నిర్మించడమే మిగిలింది. నిధుల సమస్య ఉండదు. ఇక అమరావతి పరుగులు పెట్టనుంది.
పోలవరం పూర్తి
పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. నిధులన్నీ పూర్తిగా నాబార్జు ద్వారా రీఎంబర్స్ చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో కేంద్రం సహకారం అవసరం. బడ్జెట్లో చెప్పిన దాని ప్రకారం పోలవరం వల్ల దేశానికి ఆహార భద్రత పోలవరం ప్రాజెక్టు వల్ల వస్తుంది. ఈ విషయంలో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించబోతోంది.
ఇండస్ట్రియల్ కారిడార్లకు మంచి రోజులు
హైదరాబాద్ – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. ఈ రెండు కారిడార్లలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పిస్తే పారిశ్రామికంగా ఏపీ తిరుగులేని విధంగా ఎదిగే అవకాశం ఉంటుంది.
వెనుకబడిన ప్రాంతాలకు బడ్జెటరీ సపోర్టు
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించడం సహా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.
ఎలా చూసినా.. గత ఇరవై ఏళ్ల కాలంలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనే ప్రస్తావనే వినిపించేది కాదు.కానీ ఈ సారి మారుమోగిపోయింది.