హైదరాబాద్: టర్కీ రాజధాని అంకారాలో ఇవాళ ఉదయం శాంతికోసం జరుగుతున్న ర్యాలీలోనే తీవ్రవాదులు పేలుళ్ళు జరిపి విధ్వంసాన్ని సృష్టించారు. ఈ పేలుళ్ళలో 30 మంది చనిపోయారు… 100 మందికి పైగా గాయపడ్డారు. టర్కీ ఆగ్నేయ ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, కుర్దిష్ తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతున్న పోరుకు నిరసనగా శాంతి ర్యాలీ సాగుతుండగా పేలుళ్ళు సంభవించాయి. ఇది తీవ్రవాదుల పనేనని, ఆత్మాహుతి దళ తీవ్రవాది ఈ దాడి జరిపి ఉండొచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
మృతదేహాలు, తెగిపడిన శరీరావయవాలతో ఘటనాస్థలం యుద్ధరంగాన్ని తలపించింది. అత్యవసర సహాయక దళాలు రంగంలోకి దిగాయి. పేలుడు తాకిడికి పక్కనున్న భవనాలుకూడా కంపించి పోయాయంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి తమ పనేనని ఇంతవరుకూ ఏ తీవ్రవాద సంస్థా ప్రకటించలేదు.