ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్ట్ ఆలస్యంగా పబ్లిక్కు అందుబాటులోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 48 వేల కోట్లకి బిల్స్ లేవని కాగ్ తన నివేదికలో తేల్చి చెప్పింది. అలాగే అదనంగా చేసిన రూ. 88 వేల కోట్ల అప్పు బడ్జట్ లో చూపించలేదని కూడా స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీలులేదు. కానీ ఏపీ ప్రభుత్వం రూ. 1,10,509.12 కోట్లను అసెంబ్లీ ఆమోదం లేకుండానే అడ్డదిడ్డంగా ఖర్చు చేసేసింది.
బిల్లులు లేకుండా చెల్లించిన మొత్తాలకు స్పెషల్ బిల్లులుగా ప్రభుత్వం పేర్కొంది. దీన్ని కాగ్ తీవ్రంగా తప్పు పట్టింది. సర్దుబాటు బిల్లులు కూడా 54,092 కోట్లుగా చూపించారని, ఇలా మార్పు చేసే అధికారం ట్రెజరీ నిబంధనలకు విరుద్ధమని కాగ్ పేర్కొంది. మరో 26,839 కోట్ల రూపాయల బిల్లులకు సరైన కారణాలు కనిపించలేదని పేర్కొంది. మరో 16,688 ఎంట్రీలకు సంబంధించి 9127 కోట్ల నిధుల వినియోగంపైనా కాగ్ పెదవి విరిచింది. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ విఫలం కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆర్ధికశాఖ చెప్పడాన్ని కాగ్ తప్పు పట్టింది.
ఇక ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ డొల్లతనాన్ని కాగ్ ెల్లడించింది. ఏడాది 331 రోజులపాటు 1.04 లక్షల కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి చేబదులుగా అప్పు తీసుకుంది. 103 రోజులపాటు ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉంది. ఖజానా నిల్వ రూ. 1.94 కోట్లుకన్నా తక్కువగా ఉన్న సమయంలో ఈ ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లింది. 2019-20లో రూ 67 వేల కోట్లు గ్యారంటీలుగా ఉండగా, 2020-21లో రూ 91,330 కోట్లకు చేరినట్లు వివరించింది. రుణాలు కూడా జిఎస్‌డిపిలో 35 శాతానికి చేరుకున్నట్లు పేర్కొరది. ఇంకా బడ్జెట్లో చూపని.. కాగ్ దృష్టికి రాని రుణాల గురించి ప్రస్తావించలేదు.