తూచ్.. జమిలీ ఎన్నికలు ఇప్పుడే కాదు !

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కు అందరూ రెడీ అయిపోయారు. కానీ కేంద్రం మాత్రం వెనుకడుగు వేసింది. ఇప్పుడల్లా సాధ్యం కాదని లా కమిషన్ నివేదిక సిద్ధం చేసినట్లుగా ఢిల్లీ మీడియా ప్రకటించేసింది. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమే అని రామ్ నాథ్ కోవింద్ కమిటీకి నివేదిక సమర్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. జమిలి ఎన్నికలపై రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.

ఒకే దేశం, ఒకే ఎన్నిక పై లా కమిషన్ సెప్టెంబర్ 27న సమావేశమైంది. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ చర్చిస్తోంది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే కేంద్రం తదుపరి కార్యాచరణ ఉండనుంది. అయితే ఈ కమిటీకి కాలపరిమితిలేదు. అందుకే ఎప్పుడు నివేదిక ఇస్తుందో స్పష్టత లేదు. అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా ఈ కమిటీ నిర్ణయించనుంది.

ఈ కమిటీకి లా కమిషన్ చేసే సిఫార్సులు కీలకం కానున్నాయి. అన్ని స్థాయిల ఎన్నికలు ఒకే సారి నిర్వహించాలంటే లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారాలు చూపడం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. ఏదైనా ఒక్క సారే ఎన్నికలు పెట్టగలరు కానీ.. తర్వాత మళ్లీ.. మధ్యలో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని.. భారత ప్రజాస్వామ్యంలో ఉపఎన్నికలు… మధ్యంతర ఎన్నికలు.. ప్రభుత్వాలు కూలిపోవడం వంటివి కామన్ అని చెబుతున్నారు. అందుకే జమిలీ ఎన్నికలపై బీజేపీ మరోసారి గెలిస్తే కొత్త ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ల‌డ్డూ గాడి పెళ్లిలో ‘మ్యాడ్‌’ గోల‌!

https://www.youtube.com/watch?v=AAfT5vNukzc గ‌తేడాది విజ‌య‌వంత‌మైన సినిమాల జాబితాలో `మ్యాడ్‌` కూడా ఉంటుంది. ముగ్గురు యువ హీరోల‌తో చేసిన ఈ ప్ర‌య‌త్నం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని రాబ‌ట్టింది. `మ్యాడ్` విజ‌యంలో వినోదానికి, దాంతో పాటు సంగీతానికీ...

మీడియా వాచ్‌: అక్కినేనిని మ‌రిచిన ఈనాడు

ఈరోజు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు శ‌త జ‌యంతి. ఓ మ‌హాన‌టుడి ప్ర‌యాణంలో, ప్ర‌స్థానంలో శ‌తాబ్ద కాలం పూర్త‌య్యింది. ఓర‌కంగా తెలుగు చిత్ర‌సీమ పండ‌గ‌లా జ‌రుపుకోవాల్సిన త‌రుణం ఇది. అయితే ఏపీలో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే చ‌క్క‌బ‌డుతున్నాయి....

దిల్‌రాజుకు కీల‌క పద‌వి?

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌) ఛైర్మ‌న్‌గా దిల్ రాజును ఎంపిక చేయొచ్చ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌....

కొత్త ట్రెండ్ : ఇంటికన్నా ఇంటీరియర్ ఖర్చు ఎక్కువ !

ఓ దశాబ్దం కిందట ఇల్లు అంటే... గోడలు, అల్మరాలు మాత్రమే. ఇంకా కాస్త డబ్బు ఉంటే.. ఆ అల్మరాలకు ప్లైఉడ్ తలుపులు పెట్టించుకుంటారు. కానీ తర్వాత రాను రాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close