శాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటకరణను తాత్కలికంగా పక్కన పెట్టామంటూ కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ చేసిన ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆ అంశానికి విస్తృత ప్రచారం లభించింది. రాజకీయ పార్టీలన్నీ తమ ఘనతేనని ప్రకటించుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు అయితే కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని ప్రకటించారు. బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ .. తాము విశాఖలో విజయోత్సవాలు ఏర్పాటు చేశామని ప్రకటించేశారు.
అయితే మొత్తంగా కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో వాటాల ఉపసంహరణ ప్రకియపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. ఆపడానికి కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని.. స్పష్టం చేసింది. డిజిన్విస్టె మెంట్ ప్రక్రియ కొనసాగుతుదని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారని వివిద పత్రికల్లో.. మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానే ఈ వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నాయి. తమ వల్లేనని చెప్పుకుంటున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రపంచ వ్యాప్తంగా ముసురుకుంటున్న ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. అందుకే ప్రైవేటీకరణ ప్రక్రయి మెల్లగా సాగుతోంది. ముందస్తుగా మడిసరుకు కోసం ప్రైవేటు పార్టీల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ కోసం బిడ్ కోరారు. ఆ బిడ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికేనని ప్రచారం జరిగింది.అదికాదుకానీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రం ఆగదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు క్రెడిట్ తీసుకున్న నేతలంతా ఏం చేస్తారో ?