నాలుగు వందలు ఉండే గ్యాస్ సిలిండర్ ను పదకొండున్నర వందలు చేసిన మోదీ సర్కార్.. సబ్సిడీని నలభై రూపాయలుగా బ్యాంక్ అకౌంట్ లో వేస్తోంది. గ్యాస్ బండ కొనాల్సి వచ్చినప్పుడల్లా సగటు జీవి కడుపు మండిపోతూ ఉంటుంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రజల వద్దకు ఓట్లకు వెళ్లే సమయం దగ్గర పడటంతో ఎందుకైనా మంచిదని దోపిడీని కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సిలిండర్ ధరను రెండు వందలు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇది ఆరంభమే.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను ఐదు రూపాయలు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అయితే గత పదేళ్లుగా ముఖ్యంగా కరోనా తర్వాత ద్రోవ్యల్బణం విపరీతంగా పెరిగిపోవడానికి సామాన్యుల జీవితం భారంగా మారడానికి ఈ పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరల భారాలే కారణం. అయినా ఎప్పుడూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ హయాంలో పెట్రోల్, డీజిల్ పై సుంకాలు ఏటా అరవై వేల కోట్లు వస్తే .. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా మూడు లక్షల కోట్లకుపైగానే వసూలు చేస్తోంది. గ్యాస్ బండలపై ప్రజలకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ఇప్పుడు కాస్త తగ్గించారు.
నిత్యావసర వస్తువుల దరల పెరుగుదల మంట ఓటర్లలో ఉందని.. అది ఓటింగ్ లో కనిపిస్తుందన్న విశ్లేషణలు వస్తూండటంతో.. కేంద్రం ముందు జాగ్రత్తగా.. వీలైనంత సాప్ట్ గా .. ప్రజలకు పెట్టిన వాతలపై వెన్న పూసే ప్రయత్నం చేస్తోంది. ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో కానీ.. ప్రజలు మరోసారి.. నమ్మితే మాత్రం.. ఈ సారి గ్యాస్ బండ రెండు అవడం ఖాయమన్న భయాలు మత్రం ప్రజల్లో వస్తున్నాయి.