ఎన్నికల వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్చను వైఎస్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పని చేయడం తన జీవితంలో కీలక మలుపన్నారు. వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని, కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారన్నారు. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదన్నారు. ఆయన దగ్గర పని చేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబు సమయంలో ఎప్పుడూ ప్రాధాన్యత పోస్టులు దక్కించుకోలేదు. వైఎస్ హయాంలోనే ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా కీలకంగా వ్యవహరించారు. అంతకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా… ప్రధాన పోస్టులుగా పేర్కొనదగ్గ వాటిని ఆయన పొందలేకపోయారు. కారణం ఏమిటో స్పష్టత లేదు కానీ… ఆయన ఎస్ఈసీగా నియమితులు కావడానికి కూడా గవర్నర్ నరసింహన్ కారణం. రాజ్‌భవన్ కార్యదర్శిగా నిమ్మగడ్డ ఆరేడేళ్ల పాటు పని చేశారు. రిటైరైన తర్వాత ఎస్ఈసీ పదవిని నరసింహనే ఇప్పించారు. చంద్రబాబు బిశ్వాల్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరును రెండు సార్లు సిఫార్సు చేసినా నరసింహన్… తిప్పి పంపి.. నిమ్మగడ్డనే ఖరారు చేయించారు. అలా తనకు రాజ్‌భవన్ వల్లనే ఎస్ఈసీ పదవి వచ్చిందని నిమ్మగడ్డ నిర్మోహమాటంగా చెబుతున్నారు
అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. వైఎస్ కుమారుడు.. ఆయన పార్టీ నేతలు ఆయనను కులం పేరుతో దూషిస్తున్నంత పనిచేస్తున్నారు. తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అయితే.. నిమ్మగడ్డ మాత్రం వాటిని రాజ్యాంగ బద్ధంగా డీల్ చేసుకుంటూ.. తన పనితాను చేసుకుపోతున్నారు. ఆయన ఏం జరిగినా సరే తన విధుల్ని తాను పక్కాగా నిర్వహించాలని అనుకుంటున్నట్లుగాకనిపిస్తోంది. ఈ విషయంలో నిమ్మగడ్డ కూడా వైఎస్‌నే ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని వైసీపీ నేతలు గొణుక్కుంటున్నారు.