స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో 3300 కోట్ల దుర్వినియోగం నుంచి చివరికి 27 కోట్లు టీడీపీ ఖాతాలోకి వచ్చాయన్న దాకా దిగజారిపోయిన సీఐడీ… కనీసం వాటికైనా ఆధారాలు కోర్టు ముందు ఉంచిందా అంటే అదీ లేదు. కేసులో సీఐడీ చేసిన ఏ ఒక్క ఆరోపణలకు మెటీరియల్ సాక్ష్యాలు లేదని చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నది. అసలు నిధులు దుర్వినియోగం అయ్యాయన్నదానికి కూడా సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. మరి సీఐడీ ఎలా కేసు నమోదు చేసిందో దిగువ కోర్టు సాక్ష్యాలు ఉన్నట్లుగా ఉన్నాయి అని అనిపించచి ఎందుకు రిమాండ్ విధించిందో.. ఇదే కేసులో 53 రోజుల పాటు 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని ఎలా జైల్లో పెట్టారో … ఇలాంటి తప్పుడు కేసును పెట్టిన సీఐడీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందు ముందు తేలనుంది.
షెల్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లాయని అవి చంద్రబాబు డ్రా చేసుకున్నారని సీైడీ ఆరోపించింది. మరి దానికి ఆధారం ఏమిటి అంటే.. ఏమీ లేదు. ఒక్క ట్రాన్సాక్షన్ వివరాలు కూడా కోర్టు ముందు ఉంచలేకపోయారు. టీడీపీపీ ఖాతాలోకి వెళ్లాయని సీఐడీ ఆరోపించింది. పోనీ దానికైనా ఆధారాలు చూపించారా అంటే అదీ కూడా కట్టు కథలాగే మిగిలింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు స్పష్టమైన ఆధారాలు చూపాల్సి ఉంటుంది. కానీ సీఐడీ దగ్గర చూపేందుకు ఏమీ లేవు. ఏవేవో వాట్సాప్ మెసేజులు చూపించారు. అసలు ఈ కేసుతో సంబంధం ఉన్నాయన్నదానికి ఎలాంటి లింకులు చూపించలేకపోయారు.
మొత్తంగా నిధుల మళ్లింంపు కాదు… అసలు నిధులు దర్వినియోగం జరిగిందడానికే ఆధారాల్లేవని కోర్టు స్పష్టం చేసింది. ఇన్ కంట్యాక్స్ అధికారుులు కూడా ఏదో కేసులు పెట్టారని చెప్పారు కానీ అలాంటివి ఏమీ లేదని తేలింది. అంతిమంగా షెల్ కంపెనీలు అన్న ఆరోపణ అబద్ధం , టిడిపి పార్టీ ఎకౌంటులో డబ్బులు అనేది అబద్ధం , వాట్స్ అప్ మెసేజ్ లు అబద్ధం , ఆదాయపు పన్ను శాఖ తప్పు చేసిందని చెప్పింది అనేది అబద్ధం , చంద్రబాబుకి డబ్బులు వచ్చాయి అనేది అబద్ధం , అధికారుల పై బాబు ఒత్తిడి తెచ్చారు అనేది అబద్ధం .. మొత్తంగా స్కిల్ కేసు అబద్దం.
ఈ ప్రభుత్వం ఓ అబద్దం.. సీఐడీ ఓ ఫేక్.. సీఐడీ అధికారులు డబుల్ ఫేక్… చట్టాలు.. వ్యవస్థలతో ఆటలాడే ఇలాంటి ప్రభుత్వం, సీఐడీ లాంటి వ్యవస్థలకు సరైన శిక్ష పడకపోతే అది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అవుతుంది.