నటీనటుల ఎంపికపై దర్శకుడు, నిర్మాత తర్జన భర్జనలు పడడం తెర వెనుక మామూలే. దర్శకుడికి కొన్ని ఆబ్లికేషన్స్ ఉంటాయి. నిర్మాతకీ అంతే. అయితే అంతిమంగా ఇద్దరూ కంబైన్డ్‌గా ఓ నిర్ణయానికి రావాల్సిందే. అయితే.. ఈమధ్య ఓ సినిమా మొదలైపోయింది. అందులో ఓ హీరోయిన్ని నిర్మాత కావాలని ఓకే చేశాడు. ఆ హీరోయిన్ విషయంలో ఇప్పుడు దర్శకుడు, నిర్మాతా గొడవ పడుతున్నట్టు ఇండ్రస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
తొలి సినిమా ఇంకా విడుదల కాక మునుపే.. మరో మంచి సినిమాని తన ఖాతాలో వేసుకుంది ఓ కుర్ర హీరోయిన్. అయితే సదరు సినిమాలో ఆమెకు నిర్మాత ఆబ్లికేషన్ మీద ఎంట్రీ లభించింది. దర్శకుడు మాత్రం `నా సినిమాలో కథానాయిక పాత్రకు.. తను ఏమాత్రం సరిపోదు.. కావాలంటే మరో హీరోయిన్ ని పెట్టుకుందాం` అని నిర్మాతని అభ్యర్థించాడట. కానీ… సదరు నిర్మాత మాత్రం.. `అది కుదరని పని.. కావాలంటే.. కథ ఇచ్చేసి నువ్వే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకో` అనేశాడట. ఓ హీరోయిన్ కోసం దర్శకుడినే మార్చేద్దామనుకున్నాడో నిర్మాత. దాన్ని బట్టి, ఆ ప్రొడ్యూసర్ ఎంత స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడో అర్థం అవుతోంది. గత్యంతరం లేక.. నిర్మాత ఎంపిక చేసిన హీరోయిన్ తోనే.. షూటింగ్ మొదలెడుతున్నారిప్పుడు. మున్ముందు ఈ హీరోయిన్ ఇంకెన్ని గొడవలకు సూత్రధారి అవుతుందో మరి.