ప్రధాని మోదీ పిలుపునిచ్చిన “డీపీ” ద్వారా దేశ భక్తి ప్రదర్శన చాలా మందికి నచ్చడం లేదు. మేం భారతీయులు.. మా దేశభక్తిని ప్రదర్శించుకోవాల్సిన..నిరూపించుకోవాల్సిన అవసరం ఏమిటన్న ఆలోచన ఎక్కువమందిలో ఉంది. అయితే బీజేపీ వర్గాలు.. బీజేపీ మిత్రపక్షాలు.. ఇంకా సానుభూతి పరులు డీపీలు మార్చుకుంటున్నారు. అయితే ఏపీలోని చాలా రాజకీయ పార్టీలు డీపీలను మార్చుకోలేదు. సీఎం జగన్ డీపీ మాత్రం మూడో తేదీన మారింది. రెండో తేదీ నుంచిమార్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
అయితే ఒక రోజు ఆలస్యంగా ఏపీ సీఎం అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో డీపీ మారింది. అయితే రాజకీయ పార్టీ పరంగా ఎలాంటి డీపీలు మార్చుకోలేదు. వైసీపీ మాత్రమే కాదు. .టీడీపీ జనసేన కూడా ఎలాంటి డీపీలు మార్చే కార్యక్రమాన్ని పెట్టుకోలేదు. ప్రధాని పిలుపునిచ్చిన మేరకు అందరూ డీపీలు మార్చుకుంటే సోషల్ మీడియాలో భారత త్రివర్ణ పతాకం మాత్రమే కనిపించేది. కానీ ఎక్కువ మంది అధి అధికారిక కార్యక్రమం అనుకున్నారు.
అధికారంలో ఉన్న వారికే పరిమితమనుకున్నారు. సామాన్యులైతే పట్టించుకోలేదు. మధ్య తరగతి జీవులైతే.. ఇలాంటి ఈవెంట్లను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. వారి జీవితం.. రోజువారీ ఖర్చుల్లో నలిగిపోతోంది. అదేసమయంలో మోదీ పిలుపునిచ్చిన ఈ కారక్రమంపై విమర్శలు కూడా వస్తున్నాయి. చేయాల్సినవి చేయరు కానీ ఇలాంటిప్రోగ్రామ్స్ మాత్రం పెడతారని ధరల పెరుగుదలపై కడుపు మండిపోయినవారు చెబుతున్నారు. ఏపీలోనే కాదు..తెలంగాణలోనూ అదే పరిస్థితి. అయితే చాలా మంది బీజేపీ నేతలు కూడా డీపీలు మార్చుకోవడం మర్చిపోయారు.