పెళ్లి చూపులు సినిమాతో క్రేజీ యంగ్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు విజయ్ దేవరకొండ. విజయ్ తో సినిమా చెయ్యడానికి దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఐతే ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ వల్ల విజయ్ కొత్తగా సినిమాలేం ఒప్పుకోవడం లేదు. మారుతి తో 3 సినిమాల అగ్రిమెంట్ ఇదివరకే జరిగిపోయింది. అందులో భాగంగా ఇప్పుడో సినిమా పట్టాలెక్కుతొంది. ఈ సినిమాకి మారుతి తో పాటుగా యూవీ క్రియేషన్స్ భాగం పంచుకుంటుంది. డబ్బులు పెట్టేది యూవీ… పేరు మాత్రం మారుతిది అన్నమాట. కథ, మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు మారుతి చూసుకుంటాడు. దర్శకత్వం మాత్రం మరొకరికి అప్పగించారు.
ఆ దర్శకుడే రాహుల్. ఇది వరకు ది ఎండ్ అనే హారర్ మూవీ తీశాడు రాహుల్. ఆ సినిమా కి డబ్బులు రాకపోయినా టేకింగ్ పరంగా మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ సమయం లోనే మారుతి దృష్టిలో పడ్డాడు ఈ కుర్రాడు. ఇప్పుడు తన కథ ఇచ్చి డైరెక్ట్ చెయ్యమంటున్నాడన్న మాట. మంగళవారం రాహుల్ కీ, విజయ్ కీ యూవీ సంస్థ అడ్వాన్సులు కూడా ఇచ్చేసిందంట. దేవరకొండ నటించిన ద్వారక షూటింగ్ ముగిసిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతోంది.